హైదరాబాద్ ఎల్బీనగర్ కూడలిలో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేస్తోన్న ప్రైవేటు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పనిలేక, జీతాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నామని.. తెరాస ప్రభుత్వం తమను పట్టించుకోలేవడం లేదని ఉపాధ్యాయులు వాపోయారు.
10 నెలలుగా కొవిడ్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. భిక్షాటనతోనూ బతకనివ్వడం లేదని ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ అన్నారు. పోలీసులతో ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించి.. పొట్ట గొట్టే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల చేతిలో నుంచి పోలీసులు డబ్బులు లాక్కొని అరెస్ట్ చేస్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి: నుమాయిష్ వాయిదా... కొవిడ్ నిబంధనలే కారణం