ETV Bharat / city

ఆగిన రాయితీతో మోసం బయటకు! - private seed companies in telangana

రాష్ట్రంలోని ప్రైవేటు విత్తన కంపెనీలు ప్రభుత్వాన్ని మోసగించాలని చేసిన పన్నాగం అనూహ్యంగా బయటపడింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్‌ సీడ్స్‌)ను అడ్డం పెట్టుకుని అవి ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి అడ్డంగా లాభపడాలని చూశాయి. ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్‌లో రైతులకు విక్రయిస్తున్న విత్తనాల ధరలపై రాయితీ ఇవ్వడాన్ని ప్రభుత్వం నిలిపివేయడంతో ఈ విషయం బయటపడింది.

private-seed-companies-tried-to-cheat-telangana-government
ఆగిన రాయితీతో మోసం బయటకు!
author img

By

Published : Nov 26, 2020, 9:34 AM IST

ఈ సీజన్‌లో రైతులకు 2 లక్షల క్వింటాళ్ల వేరుసెనగ విత్తనాలను, మరో 2 లక్షల క్వింటాళ్ల ఇతర విత్తనాలను రాయితీపై విక్రయిస్తామని ‘రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్‌ సీడ్స్‌) 2 నెలల క్రితం వ్యవసాయశాఖకు ప్రతిపాదనలు పంపింది. అంతకు ముందే ఇందుకు అవసరమైన విత్తనాల కోసం టెండర్లు పిలిచింది. ఆ సందర్భంగా ప్రైవేటు విత్తన సంస్థలన్నీ కుమ్మక్కై క్వింటా వేరుసెనగకు రూ.7,900 ధరను కోట్‌ చేశాయి. ఆ ధరకు 50 వేల క్వింటాళ్ల వేరుసెనగ విత్తనాలను టీఎస్‌ సీడ్స్‌ ముందస్తుగా కొనుగోలు చేసింది.

తాము కొనుగోలు చేసిన ధరకు ఇతర ఖర్చులను రూ.500 కలిపి క్వింటా వేరుసెనగ విత్తనాలకు రూ.8,400గా ధర నిర్ణయించామని, దీనిపై 33 శాతం చొప్పున రాయితీ ఇవ్వడానికి నిధులు మంజూరు చేయాలని టీఎస్‌సీడ్స్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఆ లెక్కన మొత్తం ధర రూ.8,400లో రూ.2,772 ప్రభుత్వం దగ్గర తీసుకుని, మిగిలిన రూ.5,628 చొప్పున రైతుల వద్ద నుంచి వసూలు చేసేది. అయితే ఈ సీజన్‌లో ఏ విత్తనాలపైనా రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించలేదని వ్యవసాయశాఖ ఈ ప్రతిపాదనలను పక్కనపెట్టింది.

చేసేదిలేక టీఎస్‌ సీడ్స్‌ తాను కొన్న విత్తనాలను గ్రామాల్లో అమ్మకానికి పెట్టింది. రాయితీ లేకపోవడంతో పాటు మార్కెట్‌లో ప్రైవేటు విత్తన సంస్థల వద్ద తక్కువ ధరకే లభిస్తున్నందున ఈ సంస్థ అమ్మేవాటిని కొనడానికి రైతులు ముందుకే రాలేదు. దీంతో టీఎస్‌ సీడ్స్‌ క్వింటా విక్రయ ధరను రూ.6 వేలకు తగ్గించింది. అయినా ఇప్పటికి కేవలం 8,191 క్వింటాళ్లనే అమ్మగలిగింది. దీన్ని పరిశీలిస్తే క్వింటా వేరుసెనగ విత్తనాలను బహిరంగ మార్కెట్‌లో రూ.6 వేల లోపే అమ్ముతున్న ప్రైవేటు విత్తన సంస్థలు టీఎస్‌సీడ్స్‌కు మాత్రం రూ.7,900కు అంటగట్టాయి. ఈ లెక్కన చూస్తే టీఎస్‌ సీడ్స్‌ కొనుగోలు చేసిన 50 వేల క్వింటాళ్లకు ఆ సంస్థ రూ.9.50 కోట్లను నష్టపోయింది. ప్రభుత్వం రాయితీ ఇచ్చి ఉంటే మరో లక్షా యాభై వేల క్వింటాళ్లను అదే ధరకు అమ్మి ఇటు టీఎస్‌సీడ్స్‌ సంస్థను అటు ప్రభుత్వాన్ని ప్రైవేటు విత్తన సంస్థలు ముంచేసుండేవి.

ఈ ఏడాది రూ.70 కోట్లే విడుదల

గతేడాది వరకూ అన్ని పంటల విత్తనాలపై ప్రభుత్వం రాయితీ భరించేది. ఈ ఏడాది రాయితీ కింద రూ.70 కోట్లనే విడుదల చేయడంతో అవి కాస్తా గత వానాకాలం(ఖరీఫ్‌)లో జనుము, పిల్లిపెసర, జీలుగ, సోయా విత్తనాలకే సరిపోయాయి. నిధులు అయిపోవడంతో ఈ రబీలో రాయితీ నిలిపివేసినందున ధరలో వాస్తవాలు బయటికి వచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.