ETV Bharat / city

ఫిట్‌మెంట్‌ 43 శాతం కంటే తగ్గకుండా ఇవ్వాలి : ఉద్యోగ సంఘాలు - తెలంగాణ పీఆర్సీ వార్తలు

సీఎం కేసీఆర్​పై తమకు నమ్మకం ఉందని... ఆయన ఉద్యోగుల పక్షానే ఉంటారని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. పీఆర్‌సీ అడ్వైజరీ కమిటీ మాత్రమేనని అన్నారు. గతంలో ఇచ్చిన ఫిట్‌మెంట్‌ కంటే తగ్గకుండా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

tngo
tngo
author img

By

Published : Jan 27, 2021, 6:39 PM IST

Updated : Jan 27, 2021, 10:19 PM IST

వేతన సవరణ సంఘం నివేదిక తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని... దాన్ని చెత్తబుట్టలో వేసినట్లేనని టీఎన్జీఓ, టీజీఓ సంఘాలు తెలిపాయి. పీఆర్సీ నివేదికపై టీఎన్జీఓ, టీజీఓ, సచివాలయ సంఘం ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని అధికారుల కమిటీ చర్చలు జరిపింది. ఆయా సంఘాల అభిప్రాయాలు, విజ్ఞప్తులను తీసుకొంది. కమిషన్ నివేదించిన ఏడున్నర శాతం ఫిట్​మెంట్​ను ఉద్యోగులు జీర్ణించుకోవడం లేదని... పీఆర్సీ పే రిడక్షన్ కమిటీగా, పిసినారి కమిటీగా మారిందని వ్యాఖ్యానించారు.

మెరుగైన పీఆర్సీ సాధిస్తాం

కమిషన్ కేవలం సిఫార్సులు చేసిందన్న ఉద్యోగ సంఘాల నేతలు... ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి మెరుగైన పీఆర్సీ సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన 43 శాతం కంటే ఎక్కువ ఫిట్​మెంట్ ఇవ్వాలని కోరారు. మంత్రులను కలుస్తామని, లాబీయింగ్ చేస్తామని... ముఖ్యమంత్రిని ఒప్పించి మెరుగైన ఫిట్​మెంట్ సాధిస్తామన్నారు. నెలాఖరులో పదవీ విరమణ చేసే వారికి కూడా వయసు పెంపు వర్తించాలని కోరినట్లు చెప్పారు.

కేసీఆర్ మీద నమ్మకం ఉంది

పీఆర్సీ కమిటీ అశాస్త్రీయంగా నివేదిక ఇచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. కుటుంబానికి ముగ్గురిని యూనిట్​గా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదన్న టీఎన్జీఓ, టీజీఓలు... గత ప్రభుత్వాలతో వ్యవహరించినట్లే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంతో లౌక్యంతో వ్యవహరిస్తున్నామని, లౌక్యంతో సాధ్యం కానప్పుడు మరో మార్గంలో ఆలోచిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ మీద నమ్మకం ఉందని... మంచి ఫిట్​మెంట్ ఇస్తారని అన్నారు.

ఫిట్‌మెంట్‌ 43 శాతం కంటే తగ్గకుండా ఇవ్వాలి : ఉద్యోగ సంఘాలు

ఇదీ చదవండి : పీఆర్సీపై ఉద్యోగసంఘాల ఆగ్రహం.. పోలీసుల అప్రమత్తం

Last Updated : Jan 27, 2021, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.