ETV Bharat / city

Pooja with Scorpions: వింత ఆచారం.. తేళ్లతో భక్తుల పూజలు! - kurnool district temples

పూలు, పత్రి, పంచామృతాలతో దేవుళ్లకు అభిషేకాలు నిర్వహించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఓ చోట మాత్రం.. స్వామివారికి తేళ్లతో అభిషేకం అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం భక్తులు వాటిని చేతులతో పట్టుకుని.. శరీరమంతా పెట్టుకుంటూ విన్యాసాలు చేశారు. ఇదెక్కడో తెలుసుకోవాలంటే... ఈ కథనం చదివేయాల్సిందే.

praying-with-scorpio-kondarayudu-temple-in-kodumuru-kurnool-district
వింత ఆచారం.. తేళ్లతో భక్తుల పూజలు!
author img

By

Published : Aug 24, 2021, 9:05 AM IST

తేళ్లను చూస్తేనే చాలా మంది గజగజ వణికిపోతారు. అది ఇంట్లోకో, మనం కూర్చున్న చోటకో వస్తుందంటే చంపేయాలని చూస్తుంటారు. ఎందుకంటే అది కుట్టిందంటే ప్రాణం పోతుందేమోనని భయం. అలాంటి ఓ చోట చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఆ తేళ్లని చేతులతో పట్టుకుంటారు. అంతేనా వాటిని మెహం, చేతులు, నాలుక... ఇలా శరీరమంతా పెట్టుకుంటారు. ఎందుకిలా అని అనుమానం వస్తోందా.. ఇదేదో మసాజ్ అనుకుంటున్నారా...! అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లేనండోయ్.

ఏపీలోని కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని కొండపై వెలసిన కొండరాయుడు ఆలయంలో భక్తులు తేల్లతో పూజలు చేస్తారు. తేళ్లకు దారాలు కట్టి వాటితో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. ఇది అక్కడి ఆనవాయితీ. శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా.. కొండరాయుడు ఆలయానికి భక్తులు పోటెత్తారు. పట్టణంతో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉత్సవాల సందర్భంగా.. కొండపైన అనేక సంఖ్యలో తేళ్లు కనిపిస్తాయి. వీటిని చిన్నాపెద్ద అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ పట్టుకుని విన్యాసాలు చేశారు. నోటిపై, చేతులపై, తలపై పెట్టుకుని పూజించారు. అనంతరం కొండరాయుడికి తేళ్లతో అభిషేక పూజలు చేశారు.

వింత ఆచారం.. తేళ్లతో భక్తుల పూజలు!

ఇదేంటని అడిగితే.. శ్రావణ సోమవారం సందర్భంగా తేళ్లు కుట్టవని.. ప్రగాఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టే.. తేళ్లతో నిర్భయంగా పూజలు నిర్వహించారు. ఈ ఆచారాన్ని కొత్తగా తెలుసుకున్నవాళ్లు.. ఆశ్చర్యపోయారు.

ఇదీ చదవండి:varalakshmi vratam: సౌభాగ్యం, సిరిసంపదలిచ్చే శ్రావణలక్ష్మి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.