ETV Bharat / city

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలి: పోసాని - greater hyderabad muncipal corporation

ముఖ్యమంత్రి కేసీఆర్​ శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యల వల్లే శాంతియుత భాగ్యనగరాన్ని చూస్తున్నామని నటుడు పోసాని కృష్ణమురళి అభిప్రాయపడ్డారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఓటు వేయాలని ఆయన పేర్కొన్నారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలి: పోసాని

author img

By

Published : Nov 21, 2020, 3:23 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఓటు వేయాలని నటుడు పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో దర్శకుడు ఎన్.శంకర్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు భాగ్యనగరంలో ఎక్కువగా మతకలహాలే ఉండేవని.. కేసీఆర్ శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలతో శాంతియుత హైదరాబాద్​ని చూస్తున్నామని అభిప్రాయపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన కేసీఆర్... రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు అన్ని వేళలా విద్యుత్, మంచినీరు, సాగునీటిని అందించారని పేర్కొన్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మత రాజకీయాలు చేస్తున్నారని దర్శకుడు మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలని కోరారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఆయన... ప్రజలు తెరాసకు ఓటు వేయాలని కోరారు.

ఇవీ చూడండి: మంత్రి కేటీఆర్​తో యాంకర్​ సుమ భేటీ... ఎందుకంటే...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.