ETV Bharat / city

తెలంగాణలో భాజపాకు బలం లేదు:  పొన్నం - PONNAM_ON_BJP

రాష్ట్రంలో భాజపాకు ఏ మాత్రం బలం లేదని కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​ ఆరోపించారు. ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటూ బలపడుతున్నామని కమల నేతలు కలలుగంటున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో భాజపాకు బలం లేదు:  పొన్నం
author img

By

Published : Aug 14, 2019, 7:56 PM IST

తెలంగాణలో ఏ మాత్రం బలం లేని భాజపా... వివిధ పార్టీలకు చెందిన నాయకులను పార్టీలోకి చేర్చుకుంటూ... బలపడుతున్నట్లు ఆ పార్టీ నేతలు కలలుగంటున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల మెప్పు పొందాలని కమలం నేతలకు పొన్నం సూచించారు. అది చేయకుండా ఇతర పార్టీల్లో అలకపూనిన వాళ్లను తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటూ అటు కాంగ్రెస్‌ పార్టీని, ఇటు తెరాసలను విమర్శించడం ఆ పార్టీ నేతలకు అలవాటైందని విమర్శించారు. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ కోసం కేంద్రం ఏమి చేసిందో చెప్పాలని.. భాజపా నేతలను ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణ అమరవీరులను, 60 సంవత్సరాల ప్రజల ఆకాంక్షలను అవమానపరిచే విధంగా మాట్లాడడంపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి: కొప్పుల రాజును బద్నాం చేయడానికే ఆ వ్యాఖ్యలు: భట్టి

Intro:Body:TG_HYD_39_12_NEW_CAB_SERVICE_LAUNCHED_IN_HYDERABAD_7202041

హైదరాబాద్‌లో మార్కెట్లోకి మరో క్యాబ‌్ సర్వీసు ప్రవేశించింది. భాగ్యనగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రైడ్‌ఈజీ సంస్థ యాప్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఆవిష్కరించారు. మొత్తం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టామని, ఇప్పటికే 4200 మంది డ్రైవర్లు ఉన్నారని ఆ సంస్థ సీఎండీ రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. 15 శాతం కమీషన్‌, రోజువారీ ఛార్జీలలో ఒకదానిని డ్రైవర్లు ఎంచుకోవచ్చని... వినియోగదారులకు సర్‌ఛార్జీలు ఉండవని ఆయన ప్రకటించారు. త్వరలోనే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలతో పాటు కేరళ, బెంగళూరు, చైన్నైలలో కూడా కార్యకలాపాలు ప్రారంభిస్తామని అన్నారు.

బైట్‌ : రాజశేఖర్‌ రెడ్డి, సీఎండీ, రైడ్‌ఈజీ
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.