తెలంగాణలోని ప్రాజెక్టుల క్వాలిటీలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే విచారణ జరపాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాం మాధవ్‌లు చాలాసార్లు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై జరుగుతున్న అవినీతిపై మాట్లాడారని పొన్నం గుర్తు చేశారు. కల్వకుర్తి పంప్‌హౌస్ ఘటన మీద ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారన్నారు.
ఉత్తర తెలంగాణకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక స్థలాల్లో నాణ్యత లేకుండా నిర్మించారని పొన్నం పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు విషయంలోనూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నామమాత్రపు వినతిపత్రాన్ని అందజేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో నాణ్యతలేని అన్ని ప్రాజెక్టులపై విచారణకు ఆదేశించాలన్నారు.
ఇదీ చదవండిః కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతల అరెస్ట్