ETV Bharat / city

కాలుష్య కోరల్లో పారిశ్రామికవాడ - pollution in jeedimetla industrial area

ఇది కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలోని బోరు.. 6నెలల కిందట 600 అడుగుల లోతులో వేశారు. బోరు వేయడమే ఆలస్యం.. ఘాటువాసనతో ఎర్రటి నీళ్లు వచ్చాయి. మంచినీరు వస్తుందేమోనని చాలారోజులు నిరంతరాయంగా అలాగే వదిలేశారు. మార్పు రాకపోగా.. రంగు తీవ్రత మరింత పెరుగుతోంది. చేసేదేంలేక బోరును పక్కనపెట్టి.. ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించి చెట్లకు పోస్తున్నారు.

కాలుష్య కోరల్లో ప్రారిశ్రామికవాడ
కాలుష్య కోరల్లో ప్రారిశ్రామికవాడ
author img

By

Published : Dec 23, 2019, 7:35 AM IST

హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని జీడిమెట్లను ఆనుకుని ఉన్న కాలనీల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. 2, 3అడుగులు తవ్వితే చాలూ గంగమ్మ జాడ కనిపిస్తుంది. 60-80 అడుగుల లోపలికెళ్తే పుష్కలంగా నీరు పడతాయి. అయినా సరే.. ఏ ఒక్క ఇంట్లోనూ బోరు మోటార్‌ కనిపించదు. ఆ నీటిని తాగడం కాదు కదా.. ఇతర అవసరాలకూ వాడుకోలేని పరిస్థితి. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు సైతం వినియోగించలేని దుస్థితి. సమస్య తీవ్రత రోజురోజుకీ పెరుగుతోందని, కనీసం ఆ నీటిని తాకేందుకూ భయపడాల్సి వస్తుందంటూ స్థానికులు ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలనలో తమ గోడును వెల్లబోసుకున్నారు.

కొంతకాలం కిందట ఇక్కడ ఇల్లు నిర్మించేందుకు పిల్లర్ల కోసం గొయ్యిలు తవ్వారు. రెండు, మూడడుగులు తవ్వగానే నీళ్లు ఉబికి వచ్చాయి. ఆ నీటిని తొలగించేందుకు రెండు, మూడ్రోజులపాటు యజమానులు తీవ్రంగా యత్నించారు. ఫలితం లేకపోవడంతో అలాగే వదిలేశారు.

జీడిమెట్లలోని ఫార్మా, రసాయన, ఇతర పరిశ్రమల నుంచి ప్రమాదకరమైన ఘన, జల రసాయనవ్యర్థాలు వెలువడుతుంటాయి. ఘనవ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్‌యార్డుకు తరలించాలి. తక్కువ గాఢత ఉన్న జలవ్యర్థాలను శుద్ధిచేసి నాలాల్లోకి వదలాలి. గాఢత ఎక్కువ ఉంటే జీడిమెట్ల్లలోని శుద్ధికేంద్రానికి తరలించాలి. ఇదంతా చేయాలంటే ఒక్కో ట్యాంకర్‌కు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ఖర్చంతా దండగని కొందరు పరిశ్రమల నిర్వాహకులు ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి ప్రమాదకర వ్యర్థాలను పరిసరాల్లోకి వదిలేస్తున్నారు. వర్షాకాలం నాలాలో మురుగు ప్రవాహం ఎక్కువున్న సమయంలో వ్యర్థాలను వదిలేస్తే ఘాటువాసన అంతగా రాదని బరి తెగిస్తున్నారు.

భూగర్భంలో పైపులైన్‌

పరిశ్రమల నిర్వాహకులు రసాయన వ్యర్థాలను జీడిమెట్ల నాలాలోకి వదిలేందుకు ప్రత్యేకంగా పరిశ్రమల నుంచి నాలా వరకు భూగర్భంలో పైపులైన్‌ వేశారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో వదిలేస్తున్నారు. కొంతకాలం కిందట పీసీబీ అధికారులు పావు కిలోమీటరు కంటే ఎక్కువగా జేసీబీతో రెండు, మూడ్రోజులపాటు తవ్వకాలు జరిపితేగానీ పైపులైన్‌ జాడ చిక్కలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ప్రభావిత కాలనీలు

సుభాష్‌నగర్‌, రాంరెడ్డినగర్‌, వెంకటేశ్వరనగర్‌, ఎస్‌ఆర్‌నాయక్‌నగర్‌, అపురూపకాలనీ, వినాయక్‌ నగర్‌, కుత్బుల్లాపూర్‌, గణేష్‌నగర్‌, అయోధ్యనగర్‌, చింతల్‌, వాణినగర్‌, ఇంద్రసింగ్‌నగర్‌, మహేంద్ర నగర్‌, కాకతీయనగర్‌

సుదర్శన్‌రెడ్డినగర్‌.. ఆర్సెనిక్‌, నికెల్‌, కాడ్మియం

జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లోని భూగర్భజలాల్లో ప్రజారోగ్యంపై ప్రభావం చూపే ఆర్సెనిక్‌, నికెల్‌, కాడ్మియం తదితర రసాయన, భారలోహాలు మోతాదుకు మించి ఉన్నట్లుగా పీసీబీ పరిశీలనల్లో తేలింది. బాలానగర్‌ పరిసర ప్రాంతాల్లోని మట్టిలో ప్రమాదకర భారలోహాలున్నట్లుగా గుర్తించారు. ఈనీటితో మరుగుదొడ్లను శుభ్రంచేసినా కంపువాసన వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఘాటువాసనతో ఎర్రరంగులో ఉన్న ఆ నీటిని వాడితే దురద, కళ్లు మండటం, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తున్నట్లుగా చెప్పారు.

ఇల్లు కట్టాలంటే అదనపు ఖర్చు

ఇతరతాలతో పోలిస్తే ఇక్కడ ఇల్లు నిర్మించాలంటే రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు అధికంగా ఖర్చవుతోంది. పిల్లర్ల కోసం తీసిన గోతుల్లో కాలుష్యపు నీరు ఉబికొస్తోది. దీనిని తోడేందుకు ప్రత్యేకంగా మోటార్లు, కూలీలను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. ఫిర్యాదు అందినప్పుడు హడావుడి
పీసీబీ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతోనే పరిశ్రమల నిర్వాహకులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసినప్పుడు నీటి నమూనాలు సేకరించి హడావుడి చేస్తున్నారని, తర్వాత పట్టించుకోవడం లేదంటున్నారు. నాలాల్లో వ్యర్థాలను పారబోసేందుకు అవకాశమున్న ప్రాంతాల్లో సీసీకెమెరాలను ఏర్పాటుచేస్తామని గతంలో ప్రకటించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఒక ఉత్పత్తికి అనుమతి తీసుకుని, ఆ పేరు మీద నిబంధనలకు విరుద్ధంగా నాలుగైదు రకాలు తయారుచేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. జీడిమెట్లలోని శుద్ధికేంద్రానికి ఏయే పరిశ్రమ నుంచి ఎంతమొత్తంలో వ్యర్థాలొచ్చాయనే అంశంపై సరైన లెక్కల్లేవని వివరిస్తున్నారు. రాత్రిపూట నిఘాను పెంచేందుకు 100మంది పోలీసులతో ప్రత్యేకబృందాన్ని ఏర్పాటుచేస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదన్నారు.

400 ఇళ్లుంటే ఒక్క బోరు లేదు
- నరసింహ, వెంకటేశ్వరనగర్‌ కాలనీ సంఘం అధ్యక్షుడు

మా కాలనీలో 400వరకు ఇళ్లుంటాయి. ఏ ఇంట్లోనూ బోరు కనిపించదు. ప్రభుత్వం సరఫరా చేసే గోదావరి నీళ్లతో నెట్టుకురావాల్సిందే. అవి సరిపోకపోతే రూ.600-700 పెట్టి ట్యాంకర్‌ కొనాల్సిందే. పీసీబీకి ఫిర్యాదు చేసినా ఫలితంలేదు.

ఫోటోలో కనిపిస్తున్న బోరును వెంకటేశ్వరనగర్‌లో ఉండే యాదగిరి అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం వేయించారు. రసాయనాలు కలిసి నీళ్లు వస్తుండటంతో బోరును వాడటం పూర్తిగా ఆపేశారు. గోదావరి నీటినే పొదుపుగా వాడుకుంటున్నామని చెప్పారు.

వందల మీటర్ల వరకు ఘాటు
- అనంతలక్ష్మి, కుత్బుల్లాపూర్‌ డివిజన్‌

మేం 24 ఏళ్ల కిందట ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. సుమారు కి.మీ దూరంలో జీడిమెట్ల పారిశ్రామికవాడ ఉంటుంది. వ్యక్తిగత అవసరాల నిమిత్తం అప్పుడు బావి తవ్వాం. మూత తెరిస్తే ఘాటువాసన వందల మీటర్ల వరకు వస్తుంది. సమస్య తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది తప్ప తగ్గడంలేదు.

ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన దుండగుడు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.