ETV Bharat / city

కడలిలో పెరుగుతున్న ఆమ్లశాతం.. రూ. లక్షల కోట్ల సంపదకు ముప్పు - విశాఖ వాతావరణ కేంద్రం

ఆమ్లశాతం పెరుగుదల కారణంగా బంగాళాఖాతంలో జీవావరణం క్రమంగా ముప్పు ముంగిట్లోకి వెళ్తోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా రూ.లక్షల కోట్ల విలువైన సంపద తరిగిపోయే ప్రమాదముందని సముద్ర అధ్యయన జాతీయ సంస్థ (ఎన్‌ఐఓ) శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

కడలిలో పెరుగుతున్న ఆమ్లశాతం.. రూ. లక్షల కోట్ల సంపదకు ముప్పు

author img

By

Published : Nov 20, 2020, 10:58 AM IST

ప్రపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత పెరుగుతుండడంతో బంగాళాఖాతానికీ ముప్పు తీవ్రత అధికమవుతోంది. ద్రావణాల పీహెచ్‌ (పొటెన్షియల్‌ ఆఫ్‌ హైడ్రోజన్‌) విలువ 0-14 వరకు ఉంటుంది. 0-7 వరకు ఉంటే ఆమ్లశాతం ఉన్నట్లుగానూ, 7-14 వరకు ఉంటే క్షారశాతం ఉన్నట్లుగా పేర్కొంటారు. సరిగ్గా 7 ఉంటే ఆమ్ల, క్షార లక్షణాలు సమపాళ్లలో ఉన్నట్లు పరిగణిస్తారు. ఆమ్లశాతం పెరిగితే సముద్రంలోని జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంటుంది. ఆమ్లశాతం పెరిగితే సముద్రంలో ఉండే ‘ఆల్గే’ అనే జీవజాతి నశించిపోతుంది. దాన్ని తిని బతికే ‘జూప్లాంక్టన్‌’ అనే జీవరాశి కూడా మనుగడ సాగించలేదు. ఫలితంగా ఆ రెండింటిపై ఆధారపడే మత్స్యసంపద, జీవసంపద మొత్తానికి ముప్పు వచ్చినట్లే.

కొరల్స్‌ కూడా కనుమరుగవుతాయి

కాలుష్యంతో సముద్ర అంతర్భాగాల్లో ఉండే కొరల్స్‌ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. సముద్రంలో ఉండే కాల్షియం అణువులు, బొగ్గుపులుసు వాయువుతో కలిసి కాల్షియం కార్బొనేట్‌ ఏర్పడుతుంది. అదే కొరల్స్‌గా కనువిందు చేస్తుంది. ఆమ్లశాతం పెరిగితే కొరల్స్‌ కూడా కరిగిపోయి అందులో ఉన్న బొగ్గుపులుసు వాయువు బయటకు వస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

పస్తుత పరిస్థితి ఏమిటి?

బంగాళాఖాతంలోని జలాల సగటు పి.హెచ్‌. విలువ 8.1కి చేరుకుంది. ఇది ఆమ్లశాతం వైపు పయనిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచంలో ఇతర సముద్రాల పి.హెచ్‌. విలువ తగ్గుదల సంవత్సరానికి 0.002% ఉండగా, బంగాళాఖాతంలో 0.007%గా నమోదవడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది.

తీవ్రతను తగ్గించుకోవాలి

సముద్రాల్లో ఆమ్లశాతం పెరగడం ఆందోళన కలిగించే పరిణామమే. ఆమ్లశాతం పెరిగితే సాగరాల్లోని జీవజాతులు నశించిపోతాయి. ఫలితంగా సముద్ర జీవరాశుల నుంచి ఆర్జించడానికి అవకాశం ఉన్న రూ.లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతాం. సముద్ర జీవరాశి మొత్తం నాశనమయ్యే పరిస్థితులు రావడానికి వందలు, వేల సంవత్సరాల సమయం పడుతుంది. సముద్రాల్లో ఆమ్లశాతం పెరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటే ముప్పు తీవ్రతను తగ్గించుకోవచ్చని సముద్ర అధ్యయన జాతీయ సంస్థ డాక్టర్‌ వి.వి.ఎస్‌.శర్మ, సీనియర్‌ ముఖ్య శాస్త్రవేత్త తెలిపారు.

ఇదీ చూడండి: బల్దియా పోలీసులకు లేరు పోటీ... శాంతిభద్రతలో వాళ్లకు వాళ్లే సాటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.