ETV Bharat / city

మంత్రి హత్యకు కుట్ర కేసులో లోతుగా విచారణ.. జితేందర్​రెడ్డి పీఏకు నోటీసులు.. - మాజీ మంత్రి డీకే అరుణ హస్తం

Srinivas Goud Murder Plan Case: మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హత్యకు కుట్ర కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ కుట్ర వెనక ఎవరెవరి హస్తం ఉందన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే 12 మంది నిందితులను రిమాండ్​కు తరలించగా... తాజాగా మాజీ ఎంపీ జితేందర్​ రెడ్డి పీఏ రాజుకు నోటీసులిచ్చారు.

Police issued notices to jithender reddy PA raju in Srinivas Goud Murder Plan Case

author img

By

Published : Mar 4, 2022, 3:08 PM IST

Srinivas Goud Murder Plan Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించింన మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హత్యకు కుట్ర కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పన్నెండు మందిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించిన పోలీసులు.. కుట్ర వెనక ఎవరెవరి హస్తం ఉందన్న కోణంలో విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడైన రాఘవేందర్​రాజ్​ ఇప్పటికే కీలక విషయాలు వెల్లడించారు. ఈ కుట్ర వెనక మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ హస్తం ఉందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. పోలీసుల ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు.

వారి ప్రమేయం ఉందా..?

ఈ కుట్రలో నిందితులు దిల్లీలోని జితేందర్​ రెడ్డి సర్వెంట్​ క్వార్టర్స్​లో తలదాచుకోగా.. ఆశ్రయం ఇచ్చిన వారి ప్రమేయం ఎంత వరకు ఉందన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. కేసులో అరెస్టయిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరు నిదింతులు.. దిల్లీలోని జితేందర్ రెడ్డి అతిథిగృహంలో ఆశ్రయం పొందారు. వీళ్ల ముగ్గురికి జితేందర్ రెడ్డి పీఏ రాజు ఆశ్రయం కల్పించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ జితేందర్​ రెడ్డి పీఏ రాజుకు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దిల్లీలోని ఎంపీ క్వార్టర్స్​లో ఉంటున్న రాజు.. కేసు విచారణ కోసం హైదరాబాద్​ రావాలని నోటీసులిచ్చారు. కేసులో భాగంగా నిర్వహిస్తున్న దర్యాప్తునకు సహకరించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

నిందితులకు జితేందర్​రెడ్డి పీఏ రాజుకు ముగ్గురు ఎలా పరిచయం..? ఆశ్రయం ఇవ్వటం వెనక ఉద్దేశం ఏంటీ..? హత్య కుట్రకు సంబంధించి ఏమైనా తెలుసా..? ఈ కుట్రలో వీళ్ల పాత్ర ఏమైనా ఉందా..? లాంటి అంశాలపై పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.