తనకు కరోనా సోకిందంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్లపై తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి స్పందించారు. ఎస్వీ బద్రి అనే వ్యక్తి తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా.. శ్రీవారి భక్తులను కూడా భయభ్రాంతులకు గురి చేశారంటూ తితిదే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో.. దర్శనాలను నిలిపివేసేందుకు వెనుకాడుతున్నారంటూ ఎస్వీ బద్రి ట్వీట్ చేశారు. డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ వచ్చినా... అర్చకులకు మహమ్మారి సోకుతున్నా పట్టించుకోని తితిదే అధికారులు ఖర్మఫలం అనుభవించక తప్పదంటూ చేసిన ట్వీట్లు తిరుమలలో కలకలం సృష్టించాయి.
విషయంపై తితిదే విజిలెన్స్ వింగ్ ఏవీఎస్వో నాగేశ్వరరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తిరుమల ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. ఎపిడమిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి..
తెలంగాణ: నిమ్స్‌లో కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం