ETV Bharat / city

PM MODI IRON STATUE: తుక్కుతో ఉక్కు మోదీకి ప్రాణం పోశారు.. ఎక్కడంటే..?

వాడిన ఇనుప వస్తువులతో ప్రధాని నరేంద్రమోదీ నిలువెత్తు రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి కళాకారులు. 14 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం తయారీకి.. రెండు టన్నుల ఇనుము ఉపయోగించారు. విగ్రహ రూపకల్పనకు రెండు నెలల సమయం తీసుకున్న కళాకారులు.. ముఖభాగం తయారీకే 20 రోజల పాటు శ్రమించారు.

author img

By

Published : Sep 14, 2021, 7:49 PM IST

pm-modi-iron-statue-with-scrap-at-tenali

ఇనుప కండరాల నరేంద్ర మోదీ @ తెనాలి

ఇనుప వస్తువులతో ప్రధాని నరేంద్ర మోదీ నిలువెత్తు విగ్రహం రూపుదిద్దుకుంది. ఈ విగ్రహం తయారీకి.. వాడి పారేసిన మోటారు వాహనాల విడిభాగాలను ఉపయోగించారు. తెనాలి కళాకారుల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తున్న ఈ విగ్రహం.. మరికొన్ని రోజుల్లో బెంగళూరులో కొలువుదీరనుంది.

ఇనుప వస్తువులతో ప్రధాని నరేంద్రమోదీ నిలువెత్తు రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు గుంటూరు జిల్లా తెనాలి కళాకారులు. 14 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం తయారీకి.. రెండు టన్నుల ఇనుము ఉపయోగించారు. విగ్రహ రూపకల్పనకు రెండు నెలల సమయం తీసుకున్న కళాకారులు.. ముఖభాగం తయారీకే 20 రోజల పాటు శ్రమించారు. మోదీ ఆహార్యాన్ని ఈ విగ్రహంలో పొందుపర్చడం కోసం ప్రత్యేక శ్రద్ధ కనబర్చినట్లు శిల్పులు తెలిపారు.

''ప్రధాని నరేంద్ర మోదీ ఆహార్యాన్ని రూపుదిద్దేందుకు వివిధ రకాల ఇనుప వస్తువులను కలిపి వినియోగించాం. విగ్రహం సజీవంగా ఉండేలా తయారు చేసేందుకు శ్రమించాం. మెుదటగా విగ్రహ తయారీ కోసం సంప్రదించిన బెంగళూరు సంస్థ భయపడింది. దేశ ప్రధాని విగ్రహం సరిగా వస్తుందో లేదోనని. రెండు దశాబ్ధాలుగా ఉన్న అనుభవంతో చేయగలమని హామీ ఇవ్వడంతో విగ్రహ తయారీకి అంగీకరించారు. ముందుగా నమూనాను తయారు చేశాం. ముఖాన్ని తయారు చేయడానికే 20 రోజుల వరకు పట్టింది. విగ్రహ తయారీకి ఎటువంటి ఆధునిక సాంకేతికతను వినియోగించలేదు. కేవలం చేతితోనే ప్రధాని మోదీ విగ్రహాన్ని పూర్తి చేశాం.'' - కాటూరి వెంకటేశ్వరర్రావు, శిల్పి

మోదీ విగ్రహ తయారీ కోసం గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నుంచి పాత ఇనుప సామగ్రి తీసుకువచ్చారు. మోటారు వాహనాల విడిభాగాలనే ఎక్కువగా ఉపయోగించారు. బోల్టులు, బేరింగులు, గేర్ వీల్స్, స్ప్రింగులు, రాడ్లు, స్పానర్లు, రించిలు, బాల్స్, తీగలు కలిపి.. నిండైన రూపాన్ని రూపొందించారు. మోదీ నినాదం 'మేకిన్ ఇండియా' లోగోను.. గుండెలపై అమర్చారు. దేశ ప్రధాని విగ్రహం కావడంతో పూరిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నట్లు శిల్పులు చెబుతున్నారు.

''గత 10 సంవత్సరాలుగా ఇనుప వస్తువులతో అనేక విగ్రహాలను తయారు చేస్తున్నాం. గతంలో కొన్ని జంతువుల విగ్రహాలను, మనుషుల విగ్రహాలను తయారు చేశాం. మోదీ శరీరంలో వివిధ భాగాలను ప్రతిబింబించేందుకు తయారీలో అనేక రకాల వస్తువుల కలయిక అవసరమైంది. ప్రధాని ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన 'మేక్ ఇన్​ ఇండియా' లోగోను ప్రధాని విగ్రహంలో పొందుపరిచాం.'' - కాటూరి రవిచంద్ర, శిల్పి

తెనానికి చెందిన సూర్య శిల్పశాలలో కొన్ని దశాబ్దాలుగా వివిధ రకాల విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పాత ఇనుముతో విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించారు. ఇటీవలే మహాత్మాగాంధీ 10 అడుగుల విగ్రహాన్ని 70వేల బోల్టులతో రూపొందించారు. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు సంస్థ.. గాంధీ విగ్రహం తరహాలో బోల్టులతో నరేంద్రమోదీ విగ్రహాన్ని తయారు చేయాలని కోరింది. బోల్టులు మాత్రమే ఉపయోగిస్తే రూపురేఖలు కచ్చితంగా వచ్చే అవకాశం ఉండదన్న శిల్పులు.. మరికొన్ని రకాల వస్తువుల్ని జోడిస్తామని చెప్పారు. ఆ మేరకు మోదీ విగ్రహాన్ని చూడచక్కగా సిద్ధం చేశారు. ఈ విగ్రహాన్ని బెంగళూరుకు తరలించి, మోదీ పుట్టినరోజున ఆవిష్కరించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.