ETV Bharat / city

ప్రజాప్రతినిధుల కేసులపై వెంటనే విచారణ చేపట్టాలని హైకోర్టులో పిల్​

ప్రజాప్రతినిధుల కేసులపై సత్వరమే విచారణ చేపట్టాలని ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్​ ఉన్నత న్యాయస్థానంలో పిల్​ దాఖలు చేసింది. కేసుల విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్​ ప్రాసిక్యూటర్లను నియమించాలని పిటిషన్​లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి కోర్టును కోరారు.

pill-in-the-high-court-to-hold-an-immediate-inquiry-into-the-cases-of-mlas-and-mps
ప్రజాప్రతినిధుల కేసులపై వెంటనే విచారణ చేపట్టాలని హైకోర్టులో పిల్​
author img

By

Published : Oct 9, 2020, 10:15 PM IST

ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులపై సత్వరమే విచారణ చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్​ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రజా ప్రతినిధులపై కేసులను సత్వరమే విచారణ జరపాలని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ.. ఇప్పటి వరకూ పూర్తి కాలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి పిటిషన్​లో పేర్కొన్నారు.

కేసుల విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని, విచారణపై నెలవారీ స్థాయినివేదికలు తెప్పించుకోవాలని పిటిషన్​లో కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, డీజీపీ, తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.

ఇవీ చూడండి: ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులపై హైకోర్టు కీలక నిర్ణయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.