ETV Bharat / city

పెళ్లి ఫొటోలు తీయాలన్నారు.. వెళ్లగానే కిడ్నాప్ చేశారు! - బాపట్ల జిల్లా తాజా వార్తలు

Photographer Kidnap: ఓ వ్యక్తికి పెళ్లి ఫొటోలు తీయాలంటూ ఫోన్ చేశారు. డబ్బులు గూగుల్​పే చేసినట్లు చెప్పి ఓ చోటుకు రమ్మన్నారు. అది నిజమే అని నమ్మిన అతను వాళ్లు చెప్పిన చోటుకి వెళ్లాడు. అయితే.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఫొటోగ్రాఫర్​ను కిడ్నాప్​ చేశారు. అదేంటి ఫొటోలు తీయడానికి రమ్మని చెప్పి కిడ్నాప్​ ఏంటి అనుకుంటున్నారా? అసలు కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరి చదవాల్సిందే.

photographer kidnap
ఫొటోగ్రాఫర్ కిడ్నాప్
author img

By

Published : May 29, 2022, 8:02 PM IST

Updated : May 29, 2022, 8:07 PM IST

Photographer Kidnap: ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన దొంతు నాగవెంకట సుధాకర్​కు కొందరు ఫోన్ చేశారు. పెళ్లి ఫొటోలు తియ్యాలని రమ్మన్నారు. గూగుల్​ ​పే ద్వారా డబ్బులు పంపించి ఒంగోలుకు రమ్మని చెప్పారు. అది నిజమని నమ్మిన అతడు వాళ్లు చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. అయితే.. ముందస్తు పథకం ప్రకారం సిద్ధంగా ఉన్న వాళ్లంతా.. సుధాకర్ కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి కిడ్నాప్ చేశారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి గ్రామ శివారులోకి తీసుకెళ్లి, ఓ ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. అయితే.. శనివారం రాత్రి కిడ్నాపర్లు మద్యం సేవిస్తున్న సమయంలో బాధితుడు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. గాయాలపాలైన సుధాకర్​ను చికిత్స నిమిత్తం పోలీసులు రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కుటుంబ తగాదాల నేపథ్యంలో.. తన అన్న కొడుకు సాయి తనను ఈ కిడ్నాప్ చేయించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. బాధితుడు సంతనూతలపాడు నియోజకవర్గంలో ఓ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్​గా పని చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి: రాష్ట్రంలో తొలి ఇగ్లూ థియేటర్​.. రోజుకు 5 షోలు.. ఇంకెందుకు ఆలస్యం!

పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య

Last Updated : May 29, 2022, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.