కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున... పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేయాలని తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ నిర్ణయించింది. హెచ్‌పీసీఎల్ రాష్ట్ర కోఆర్డినేటర్ రాజేశ్‌కు వినతిపత్రం అందచేశారు. నగదు లావాదేవీల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకావం ఉందన్న.. కొన్ని బంకుల్లో నగదు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయని వివరించారు.
పనివేళల కుదింపునకు..
పెట్రోల్ బంకులు పని వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండేలా చూడాలని కోరారు. పెట్రోల్ బంకుల వద్ద... వాహనదారులకు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించేట్లు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ద్వారా ప్రతి పెట్రోల్ బంకులో ప్రతిరోజూ శానిటైజేషన్ నిర్వహించాలి కోరారు.
ఇవీ చూడండి: రిలయన్స్ భరోసా- ఉచితంగా పెట్రోల్, భోజనం