ETV Bharat / city

pawan kalyan tweets on jagan: 'వైకాపా ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం'కి అన్ని రంగాలు నాశనమవుతున్నాయి'

వైకాపా, జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ మధ్య ట్వీట్ల(pawan kalyan tweets on jagan) యుద్ధం కొనసాగుతోంది. వైకాపా ప్రభుత్వంపై మరోసారి పవన్‌ ఘాటుగా ట్వీట్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం'కి అన్ని రంగాలు .. అన్ని వర్గాలు నాశనమైపోతున్నాయని విమర్శించారు.

Pawan tweet on ycp government, pawan kalyan fires on ap govt
వైకాపా ప్రభుత్వంపై పవన్ ట్వీట్, ఏపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలు
author img

By

Published : Sep 28, 2021, 3:26 PM IST

రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. అనంతరం ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య మొదలైన మాటల యుద్ధం ట్విటర్‌లో(pawan kalyan tweets on jagan) వేరేస్థాయికి చేరింది. ‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ సోమవారం రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు 'హూ లెట్ ద డాగ్స్ ఔట్' అన్న పాటను ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటిగా పేర్కొన్నారు.

పేర్ని నాని స్పందన

పవన్ కల్యాణ్ ట్వీట్లకు ఏపీ మంత్రి పేర్ని నాని సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అని ట్వీట్ చేశారు. అనంతరం పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ చేశారు. ఈ రోజు పవన్​ కల్యాణ్​ మరోసారి.. వైకాపా ప్రభుత్వంపై ఘాటుగా ట్వీట్‌ చేశారు. "వైకాపా ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం'కి అన్ని రంగాలు, అన్ని వర్గాలు నాశనమవుతున్నాయి(pawan kalyan tweets on jagan). దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయింది.." అని పవన్​కల్యాణ్​(pawan tweets) ట్వీట్​ చేశారు.

  • జనం ఛీత్కారాలు
    ఓటర్ల తిరస్కారాలు
    తమరి వైవాహిక సంస్కారాలు
    వరాహ సమానులకు న'మస్కా'రాలు @PawanKalyan

    — Perni Nani (@perni_nani) September 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పవన్ ట్వీట్స్
  • వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..

    — Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ను వైకాపా నుంచి కాపాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) మరోసారి ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. 'సేవ్ ఏపీ ఫ్రం వైకాపా' (save ap from ysrcp) అంటూ ట్వీట్ చేశారు. మద్యం ఆదాయం తాకట్టుతో తెచ్చే అప్పులు... సంక్షేమ, సుపరిపాలన కాదని అన్నారు. నేటి 'నవరత్నాలు' భావితరాలకు 'నవ కష్టాలు' అని.. వైకాపా వాగ్దానాల అమలులో కనిపిస్తున్న కటిక నిజాలని పేర్కొన్నారు. మద్య నిషేధమని చెప్పి ....రుణాలకు భద్రతగా మద్యం ఆదాయం చూపారని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని..ట్రూ అప్‌ పేరిట పెంచేశారని పవన్ ఇసుక ధర తగ్గిస్తామని చెప్పి... ప్రైవేట్‌ సంస్థలకు మైనింగ్‌ హక్కులు ఇచ్చారని మండిపడ్డారు. ఏపీకి బలమైన రాజధాని నిర్మిస్తామని... ఇప్పుడు రాజధానే లేకుండా చేశారని ట్విట్టర్‌లో పవన్‌కల్యాణ్ విమర్శలు గుప్పించారు. పవన్​ కల్యాణ్​ ట్వీట్​పై నెటిజన్లు... సమర్థిస్తున్నారు. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

  • తుమ్మెదల ఝుంకారాలు
    నెమళ్ళ క్రేంకారాలు
    ఏనుగుల ఘీంకారాలు
    వైసీపీ గ్రామసింహాల గోంకారాలు
    సహజమే …

    — Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బొత్స స్పందన

సినిమా టికెట్ల విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(botsa Satyanarayana comments on pawan kalyan) చేసిన వ్యాఖ్యల​పై ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(ap minister botsa Satyanarayana) మండిపడ్డారు. సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రజలపై భారం వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయనగరంలో మీడియాతో బొత్స మాట్లాడారు. సినిమా టికెట్ల విషయం(bosta comments on cenima tickets issue)లో నియంత్రణ లేకుండాపోతోందన్నారు. జీఎస్టీ లాంటి పన్నులను స్ట్రీమ్ లైన్ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. సినిమా టికెట్ల ఆన్​లైన్(online cinema tickets) అమ్మకాల విధానాన్ని సినిమా డిస్ట్రిబ్యూటర్లే అడిగారని.. వాళ్లకు లేని బాధ పవన్​కు ఎందుకని ప్రశ్నించారు. వైకాపా మంత్రులు సన్నాసులంటూ.. నోరుందని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడతారా అంటూ ధ్వజమెత్తారు. సినిమా ఇండస్ట్రీ(bosta on cinema tickets)లో ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. పరిశ్రమలో పవన్ ఒక్కరే లేరు కదా.. చాలామంది ఉన్నారని అన్నారు. చిరంజీవి, మోహన్​బాబులాంటి పెద్దలు ప్రభుత్వంతో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. ఇది రిపబ్లిక్ ఇండియా.. మీ ఇష్టానుసారంగా ఉండటం కుదరదు అని పవన్​ను ఉద్దేశించి అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.