రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల్లోకి అక్టోబరు 1 నుంచి సందర్శకుల్ని అనుమతిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. టూరిజం బస్సులు నడుపుతామని, పర్యాటక కేంద్రాల్లో బోటింగ్‌కు అనుమతి ఇస్తామని చెప్పారు. హెరిటేజ్ తెలంగాణ (రాష్ట్ర పురావస్తుశాఖ) ఆధ్వర్యంలోని పురాతత్వ కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు, కోటలు, మ్యూజియంలతో పాటు క్రీడా మైదానాలు, క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని ఉప కేంద్రాలు, స్టేట్ ఆర్ట్ గ్యాలరీని కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా గురువారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
‘‘పర్యాటకశాఖ సిబ్బంది విధిగా ఫేస్‌మాస్క్‌తో పాటు చేతులకు గ్లౌజ్‌లు ధరించాలి. మాస్క్ ధరించి వస్తేనే సందర్శకులను అనుమతించాలి. వారి శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించాలి. ప్రైవేటు క్రీడా కేంద్రాల్లోనూ ఈ నిబంధనలు పాటించాలి. ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలి’’ అని మంత్రి ఆదేశించారు. పర్యాటకశాఖ బస్సు సీట్లను శానిటైజర్‌తో శుభ్రం చేయాలని.. బస్సుల్లో పర్యాటకులు భౌతికదూరం పాటించేలా సీట్లు ఏర్పాటు చేయాలని టూర్ ఆపరేటర్లను ఆదేశించారు.
ఇవీ చూడండి: 'మరోసారి తెలంగాణ జోలికి రాకుండా సమాధానం ఇవ్వాలి'