ETV Bharat / city

అందరూ ఉన్నా... అనాథ శవాలే!

కరోనా భయం మానవత్వాన్ని చంపేస్తున్నది. అందరూ ఉన్నా.. బాగా బతికినా.. కరోనా వల్ల చివరి క్షణాల్లో మాత్రం అనాథలుగా మిగిలిపోతున్నారు. కనీసం అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోలేక అనాథ శవాలుగా కాలిపోతున్నారు.

author img

By

Published : Apr 24, 2020, 7:13 AM IST

people afraid to attend funerals of family members cause of corona virus
అందరూ ఉన్నా... అనాథ శవాలే!

కరోనా మహమ్మారి మానవత్వాన్ని మాయం చేసింది. బాగా బతికిన వారు కూడా అనాథ శవాలుగా మారుతున్నారు. వారి అంతిమ సంస్కారాలకు ఎవరూ రాకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులే అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. మృతదేహాన్ని కొవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం శ్మశానవాటికకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే కాటికాపరులు, స్థానికులు అడ్డుకుంటున్నారు. రెండురోజుల కిందట చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్సులో ఎక్కించి ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్మశానవాటికల చుట్టూ తిరిగినా, ఎక్కడా అనుమతి లభించలేదు. చేసేది లేక జీహెచ్‌ఎంసీ సిబ్బంది నగర శివారులోని ప్రభుత్వ స్థలంలో దహనం చేశారు. అంతకు ముందురోజు కూడా ఇలాంటి అవరోధాలతో మరో శవాన్ని సిబ్బంది అక్కడే దహనం చేశారు.

ఎందుకీ సమస్య?

రాష్ట్రంలో ఎక్కడ కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనా గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స చేస్తున్నారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా రక్త సంబంధీకులను ఆసుపత్రిలో ఉండేందుకు అనుమతించట్లేదు. అందువల్ల వారు సొంత ఊర్లోనే ఉంటున్నారు. గాంధీలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఇతర రాష్ట్రాల బాధితులూ చికిత్స తీసుకుంటున్నారు. వారిలో ఎవరైనా మరణిస్తే, అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులకు సమాచారం ఇస్తున్నారు. ఇప్పటి వరకు కొందరి విషయంలోనే బంధుమిత్రులు చివరి చూపు చూడగలిగారు. చాలామంది మృతుల అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు.

వీడియోలో చూసి..

గాంధీ ఆసుపత్రిలో సోమవారం చనిపోయిన మధ్య వయస్కుడిని చూసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. చాలా దూరంలో ఉన్నామని, మీరే దహనం చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను కోరారు. మంగళవారం చనిపోయిన వ్యక్తి వయసు కేవలం 24 సంవత్సరాలు. ఎల్బీనగర్‌ ప్రాంతంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేసేవాడు. నాలుగు రోజుల కిందట ఉన్నట్టుండి రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయాడు. గాంధీ ఆసుపత్రికి చేర్చాక, 8 గంటల్లో మరణించాడు. మృతికి కారణమూ తెలియలేదు. అతడి వ్యక్తిగత గుర్తింపు కార్డు సాయంతో ఆంధ్రప్రదేశ్‌లోని కుటుంబ సభ్యులకు వైద్యులు కబురు చేశారు. వారు రావడానికి విఫలయత్నం చేశారు. లాక్‌డౌన్‌తో రాలేకపోతున్నామని మరుసటి రోజు కన్నీరుమున్నీరయ్యారు. ఫొటోలు, వీడియోలో కుమారుడి మృతదేహాన్ని చూసి విలపించారు. మీరే దహన సంస్కారాలు నిర్వహించాలని బల్దియా సిబ్బందిని కోరారు. శ్మశానం దొరక్కపోవడంతో అతడిని రంగారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో దహనం చేశారు. ఈ విషయం తెలిసిన సంబంధిత గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.