ETV Bharat / city

ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్​ తప్పుడు ప్రచారం: ఉత్తమ్‌ - ప్రాజెక్టులై ఉత్తమ్​ కుమార్ రెడ్డి

ఎస్‌ఎల్‌బీసీ ఆరేళ్లయినా పూర్తి కాలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ పరిశీలన కోసం వెళ్తుంటే అడ్డుకున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లతో మంజీరా నింపుతామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రాజెక్టులపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజనిజాలు ఏంటో ప్రజలకు తెలిపేందుకే జలదీక్ష చేపట్టినట్లు స్పష్టం చేశారు.

uttam kumar reddy
uttam kumar reddy
author img

By

Published : Jun 13, 2020, 12:35 PM IST

Updated : Jun 13, 2020, 1:14 PM IST

ప్రాజెక్టులతో అద్భుతాలు సృష్టించామని సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజనిజాలు ఏంటో ప్రజలకు తెలిపేందుకే జలదీక్ష చేపట్టినట్లు స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదులపై నిర్మించామంటున్న ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు.

పోరాడి సాధించిన తెలంగాణలో ప్రజలకు మంచి జరుగుతుందని ఆశించాం. కేసీఆర్ పాలనలో అన్నీ రాజ్యాంగబద్ధ వ్యవస్థలను బలహీనం చేశారు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఊహించలేదు. ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా అణచివేసే చర్యలు ఎప్పుడూ జరగలేదు. కొంతమంది పోలీస్ అధికారులు ఐపీఎస్‌ మాదిరిగా కాకుండా కేపీఎస్‌లుగా పనిచేస్తున్నారు.

- ఉత్తమ్​ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

తెరాస వాళ్లు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవట్లేదని ఉత్తమ్ ఆరోపించారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రోజు నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి కార్యక్రమాల్లో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని... తెరాస నేతల కార్యక్రమాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవని అన్నారు. తాము నిబంధనలు పాటించి కార్యక్రమాలు చేపట్టినా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్​ తప్పుడు ప్రచారం: ఉత్తమ్‌

ఇదీ చదవండి: జలదీక్షకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం

Last Updated : Jun 13, 2020, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.