Revanth Reddy Chit Chat: రాష్ట్రంలో ప్రజలు క్రియాశీలక ప్రభుత్వం కోరుకుంటున్న దృష్ట్యా.. గవర్నర్ పాలన పెట్టినా బాగానే ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్... "మహిళా దర్బార్" ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో క్రియాశీలక ప్రజా ప్రభుత్వం లేదన్నారు. మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా స్పందన లేదని ఆక్షేపించారు.
అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మృగశిర కార్తె నేపథ్యంలో రేవంత్‌కు కాంగ్రెస్ మత్స్యకార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మెట్టు సాయికుమార్ పెద్ద చేప బహుకరించారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో.. మీడియాతో రేవంత్ పిచ్చాపాటిగా మాట్లాడారు. సెక్షన్- 8 ప్రకారం జంట నగరాల్లో గవర్నర్‌కు సర్వాధీకారాలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. అవసరమైతే పరిపాలనను చేతిలోకి తీసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు అధికారంతో పాటు బాధ్యత కూడా ఉంటుందన్నారు. బాధ్యత తీసుకోనప్పుడు రాజ్యంగం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
"నరేంద్రమోదీ- అమిత్‌షా ద్వయం... కేసీఆర్ చేతిలోనే ఉన్నారు. గవర్నర్ చేతిలో లేరు కదా! మోదీకి గవర్నర్ ఏం చెప్పినా కేసీఆర్ మాటే వింటారు. కేసీఆర్‌కు నచ్చితే నజరానా... నచ్చకపోతే జరిమానా. దేశంలో చర్చనీయాంశమైన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో వాడిన వాహన యజమానులకు శిక్షలు పడాలి. తెరాస, ఎంఐఎం పార్టీలు పాలనే కాదు... అత్యాచారాలు కూడా పొత్తులతోనే చేస్తున్నాయి. బాలిక అత్యాచారం కేసులో పాత్రధారి వక్ఫ్స్ బోర్డు ఛైర్మన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?" - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చూడండి: