ఏపీలో నివర్ తుపాను ప్రభావంతో.. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ... జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టారు. హైదరాబాద్లోని తన నివాసంలో దీక్ష చేశారు. బాధిత రైతుల కోసం పరిహారంగా రూ.35 వేలు, అందులో తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్లే రైతులకు అండంగా నిలిచేందుకు సాయంత్రం 5 గంటల వరకు రైతు దీక్ష చేస్తున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.
నివర్ తుపాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల 32 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని... వరితోపాటు పలు పంటలు దెబ్బ తిని... రైతులు తీవ్రంగా నష్టపోయారని పవన్ చెప్పారు. ఈ ఏడాది వరుసగా మూడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన కారణంగా.. రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని అన్నారు. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారని గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: ఖమ్మంలో ఐటీహబ్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్