ETV Bharat / city

PATTANA PRAGATHI: పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రారంభమైన పట్టణ ప్రగతి

author img

By

Published : Jul 1, 2021, 8:58 PM IST

తొలి రోజు పట్టణ ప్రగతిలో భాగంగా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 2,314 కిలోమీటర్ల మేర.. రహదార్లకు ఇరువైపులా మొక్కలు నాటినట్లు అధికారులు చెప్పారు. మరో తొమ్మిదిరోజుల పాటు మరమ్మతులు సహా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

PATTANA PRAGATHI
PATTANA PRAGATHI

పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతూ.. ప్రణాళికాభివృద్ధే ధ్యేయంగా మరో దఫా పట్టణ ప్రగతి కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మరో తొమ్మది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. తొలి రోజు పలు పట్టణాల్లో చేపట్టిన పనుల వివరాలను అధికారులు వెల్లడించారు.

మూడో విడత పట్టణ ప్రగతి (PATTANA PRAGATHI)లో భాగంగా మొదటి రోజైన గురువారం జీహెచ్ఎంసీ మినహా ఇతర నగర, పురపాలికల్లో 30వేలకు పైగా మొక్కలు నాటారు. మరో 77 వేలకు పైగా మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేసినట్లు పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు.

కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో 2,314 కిలోమీటర్ల మేర.. రహదార్లకు ఇరువైపులా మొక్కలు నాటినట్లు చెప్పారు. 128 విద్యుత్‌ మీటర్లను మార్చడం సహా 1,732 మీటర్ల మేర వేలాడుతున్న విద్యుత్‌ తీగలను సరిచేశారు. మొత్తం 27,849 మీటర్లలో వేలాడుతున్న విద్యుత్‌ తీగలను సరిచేయాల్సి ఉందని విద్యుత్‌ అధికారులు అంచనా వేశారు. 168 పార్కులను శుభ్రం చేశారు. 1,338 కిలోమీటర్ల పరిధిలో మురుగు కాలువలను శుభ్రం చేసినట్లు సత్యనారాయణ తెలిపారు.

1,566 కిలోమీటర్ల పరిధిలో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న పొదలు, పిచ్చి మొక్కలు... 2,581 టన్నుల చెత్తను తొలగించినట్లు పేర్కొన్నారు. 876 టన్నుల వ్యర్థాలు, శిథిలాలను తొలగించడం సహా పాటు 169 నీటి ట్యాంకులను శుభ్రం చేసినట్లు వివరించారు. 326 పబ్లిక్ టాయిలెట్లను శుభ్రం చేయడం సహా 1,511 దళిత బస్తీల్లో అధికారులు పర్యటించినట్లు తెలిపారు.

ఇవీచూడండి: PRAGATHI: రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల పాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు

Errabelli: గంగదేవిపల్లిని మించేలా.. పల్లెలను రూపుదిద్దాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.