ETV Bharat / city

షరతులతో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విడుదల - Guntur District Jail

ఏపీలోని గుంటూరు జిల్లా జైలు నుంచి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విడుదల అయ్యారు. ఈ మేరకు కొన్ని షరతులతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారంటూ గత నెలలో ప్రవీణ్​ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

షరతులతో జైలు నుంచి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విడుదల

author img

By

Published : Feb 11, 2021, 8:34 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి ఊరట లభించింది. ఆయనకు గుంటూరు జిల్లా రెండో అదనపు న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఈరోజు జిల్లా జైలు నుంచి ప్రవీణ్ చక్రవర్తి విడుదలయ్యారు.

షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన న్యాయంస్థానం... ప్రవీణ్ ప్రతి ఆదివారం సీఐడీ కార్యాలయంలో సంతకం పెట్టాలని, దేశం విడిచివెళ్లరాదని, పాస్‌పోర్టును న్యాయస్థానానికి అప్పగించాలని స్పష్టం చేసింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ.. గత నెల 12న సీఐడీ పోలీసులు ప్రవీణ్ చక్రవర్తిని అరెస్టు చేశారు.

గుంటూరు జిల్లా జైలు నుంచి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విడుదల

ఇదీ చదవండి: ఘట్​కేసర్ అత్యాచారం కేసులో నలుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.