విదేశాలకు అత్యవసరంగా వెళ్లే ప్రయాణికుల కోసం లాక్‌డౌన్ సమయంలో కూడా సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో అప్లికేషన్ ప్రాసెసింగ్ కౌంటర్ తెరిచే ఉంటుంది. నేటి నుంచి ఈ నెల 21 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ కౌంటర్ సేవలు అందుబాటులో ఉంటాయని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయంలోని విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన బ్రాంచ్ సెక్రటేరియట్ కార్యకలాపాలు కూడా ఇదే సమయంలో కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని పాస్‌పోర్టుల జారీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న 14 తపాలాకార్యాలయాల కౌంటర్లు, ఐదు పాస్‌పోర్టు సేవా కేంద్రాల సేవలు లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయాయి. అపాయింట్‌మెంట్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు... తమ తేదీలను రీషెడ్యూల్ చేసుకోవచ్చని బాలయ్య వివరించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 3,816 కరోనా కేసులు... 27 మంది మృతి