ETV Bharat / city

కన్నుల పండువగా శ్రీవారి పార్వేట ఉత్సవం

తిరుమల శ్రీవారికి విజయదశమి పార్వేట ఉత్సవాన్ని తితిదే అధికారులు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసునికి పంచాయుధాలు ధరింపజేసి.. నమూనా అడవిలో వేట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విమాన ప్రాకారంలో ఊరేగించారు.

parveta-ustavam-held-in-tirumala
ఏకాంతంగానే శ్రీవారి పార్వేట ఉత్సవం
author img

By

Published : Oct 25, 2020, 10:40 PM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో విజయదశమి పార్వేట ఉత్సవాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. పార్వేటోత్సవంలో భాగంగా కల్యాణోత్స‌వ‌ మండపంలో మ‌ల‌య‌ప్ప‌స్వామి వారిని సన్నిధి నుంచి వేంచేపు చేశారు. అక్కడ పంచాయుధాలైన శంఖం, చ‌క్రం, గ‌ద‌, ఖ‌డ్గం, ధ‌నస్సు ధ‌రింపచేశారు. కొవిడ్‌-19 నిబంధ‌న‌ల కార‌ణంగా ఆల‌యంలోని తితిదే అట‌వీ విభాగం ఏడుకొండ‌లతో పాటు శేషాచ‌లాన్ని త‌ల‌పించేలా నమూనాను రూపొందించింది.

న‌మూనా అడ‌విలో వివిధ ర‌కాల చెట్లు, రాళ్లు ఏర్పాటు చేశారు. అందులో వ‌న్య‌మృగాల బొమ్మ‌ల‌ను ఉంచారు. ఈ ప్రాంతంలో స్వామివారు వేట‌లో పాల్గొన్నారు. అనంత‌రం విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు.

ఏకాంతంగానే శ్రీవారి పార్వేట ఉత్సవం

ఇదీ చదవండి : చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.