ETV Bharat / city

PSC Meeting: టెక్నాలజీ వినియోగంలో భేష్​.. తెలంగాణపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు

రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి, ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వ కృషిని పార్లమెంటరీ కమిటీ ప్రశంసించింది. ఐటీ వ్యవహారాలపైన ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ... రెండు రోజులుగా హైదరాబాద్​లో పర్యటిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ఇన్నోవేషన్ ఎకోసిస్టం, ఐటీ అభివృద్ధి, ప్రభుత్వ విజన్​పై స్థాయి సంఘం వివరాలు సేకరించింది. ఐటీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, దాన్ని సాధించేందుకు చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలు, ఐటీ పరిశ్రమ భాగస్వామ్యం, ఇక్కడ ఉన్న మౌలిక వసతులతో పాటు ఇతర అంశాలపైన పార్లమెంటరీ కమిటీ నేరుగా అధ్యయనం కొనసాగిస్తోంది.

author img

By

Published : Sep 8, 2021, 10:33 PM IST

Parliamentary Committee appreciate telangana government in technology usage

రెండు రోజులుగా హైదరాబాద్​లో పర్యటిస్తోన్న పార్లమెంటరీ స్థాయి సంఘం ఇవాళ హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ హోటల్​లో కమిటీ అధ్యక్షులు ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. పార్లమెంటరీ కమిటీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న కార్యక్రమాలను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ క్రమంలో రాష్ట్రానికి వచ్చిన కమిటీ... ఐటీరంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ప్రభుత్వ విజన్ వంటివాటిపై లోతుగా అధ్యయనం చేసేందుకు సంబంధిత విభాగ అధిపతులతో సమావేశమైంది. ఈ అంశంపై మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ విభాగాల అధిపతులు పార్లమెంట్ సంఘానికి కావాల్సిన వివరాలు అందజేశారు. సమావేశానంతరం కమిటీ అధ్యక్షులు శశిథరూర్​తో పాటు మిగిలిన పార్లమెంట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ జ్ఞాపికలు అందజేశారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన టీఎస్​- ఐపాస్​(ts-ipass), ఇతర విధానపరమైన నిర్ణయాలు, ఐటీ పరిశ్రమతో కలసి ప్రభుత్వం పని చేయడం వల్ల అనేక పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద టెక్ కంపెనీలకు సంబంధించిన 4 క్యాంపస్​లు అమెరికా తర్వాత హైదరాబాద్​లోనే ఉన్నాయన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనతో పాటు ఐటీ ఎగుమతులను సైతం భారీగా పెంచగలిగమన్నారు. ఇన్నోవేషన్ రంగంలో ఏర్పాటు చేసిన ఇంకుబేటర్​ల వివరాలు అందజేశారు. టీహబ్, వీహబ్, అగ్రీహబ్, బీహబ్, రిచ్, టీ వర్క్ వంటి కార్యక్రమాలను తెలిపారు. పార్లమెంటరీ స్థాయి సంఘం అత్యంత ఆసక్తిగా అడిగిన డిజిటల్ ఎకానమీ/ గవర్నెన్స్​లో ఐటీ టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన వివరాలను కేటీఆర్ అందించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మీసేవ కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పులు ముఖ్యంగా.. మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్ లెస్ గవర్నెన్స్ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు... టీ వాలెట్ సాధించిన మైలురాళ్లను వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ ద్వారా చేపడుతున్న డ్రోన్ ప్రాజెక్టు, హరితహారంలో డ్రోన్ల వినియోగం, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్న విషయాలను కేటీఆర్ వివరించారు. ముఖ్యమంత్రి విజన్ మేరకు ఏర్పాటు చేసిన ధరణికి వినియోగిస్తున్న టెక్నాలజీ, దాని పని తీరు పైన వివరాలు అందించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే ఉద్దేశంతో భారత్ నెట్ ప్రోగ్రాంని మరింతగా విస్తరించి చేపట్టిన ప్రాజెక్టు వివరాలను కేటీఆర్​ తెలిపారు. టీ ఫైబర్ ప్రాజెక్టు ప్రాధాన్యత దృష్ట్యా దీనికి ప్రత్యేకంగా కేంద్రం మద్దతు ఇవ్వాల్సిన విషయాన్ని పార్లమెంటరీ కమిటీకి గుర్తుచేశారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ప్రత్యేకంగా సహాయం అందించడంలో కేంద్రం ప్రభుత్వం మరింత చొరవ చూపించేలా ఇక్కడి విధానాల పైన ప్రత్యేక సిఫార్సు చేయాలని ఈ సందర్భంగా కమిటీని కేటీఆర్ కోరారు. తెలంగాణ లాంటి నూతన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా ఐటీఐఆర్ వంటి సమాంతర ప్రాజెక్టుని లేదా అదనపు ప్రోత్సాహాన్ని వెంటనే ప్రకటించే అంశంలో ఈ కమిటీ సహకరించాలని కోరారు.

ఇప్పటికే ఆదర్శవంతమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్న తెలంగాణ పద్ధతులను, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అంశంపైన తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని స్థాయి సంఘం తెలిపింది. ఎక్కడైన ఆదర్శవంతమైన కార్యక్రమాలు కొనసాగితే వాటి ద్వారా నేర్చుకొని, ప్రజాసంక్షేమం కోసం వాటిని అమలు చేసే విషయంలో ముందు ఉండాలన్న ఉద్దేశమం తమదని, ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ గవర్నెన్స్ సేవలు, ఇన్నోవేషన్ రంగంలో ఇంకుబేటర్​ల ఏర్పాటు, టీ ఫైబర్ ప్రాజెక్టులపైన స్థాయి సంఘం ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.