గోదారమ్మ ఒడిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే పాపికొండలు విహారయాత్ర పర్యాటకులకు ఓ మధురానుభూతి. రెండేళ్ల కిందట కచ్చులూరు ఘటన తర్వాత నిలిచిన యాత్ర ఈ ఏడాది పునఃప్రారంభించారు(Papikondalu boating start). వరదల కారణంగా కొంతకాలం ఆగిన పాపికొండలు విహారయాత్ర నేటి నుంచి ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని దేవీపట్నంలోని పోశమ్మగండి నుంచి పాపికొండల వరకు విహారం సాగనుంది. ఈ యాత్రను రాజమహేంద్రవరంలో ఆ రాష్ట్ర మంత్రి మంత్రి అవంతి ప్రారంభించనున్నారు. గోదావరిలో 26 మీటర్ల స్థాయిలో బోట్ల రాకపోకలకు అనుమతిచ్చారు.
ఎక్కడినుంచి..: ఏపీ టూరిజం ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా టికెట్లు తీసుకోవాలి. సొంత వాహనాలు లేని సందర్శకులు రాజమహేంద్రవరం సరస్వతీఘాట్‌లో ఉన్న పర్యాటక శాఖ కార్యాలయానికి ఉదయం 6.30కు చేరుకోవాలి. పర్యాటకులను అక్కడినుంచి గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వరకు వాహనంలో తీసుకెళ్తారు. యాత్ర అక్కడినుంచి మొదలవుతుంది.
యాత్ర సాగేదిలా..: ఉదయం అల్పాహారం, బోటులోనే మధ్యాహ్న భోజనం అందిస్తారు. బోటింగ్ చివరి పాయింట్ పేరంటాలపల్లి. అక్కడ అరగంట విరామం ఇస్తారు. తిరిగి అదే మార్గంలో గండిపోచమ్మ కంట్రోల్‌రూమ్‌కు బోటు చేరుకుంటుంది. అక్కడినుంచి పర్యాటకులను తిరిగి ఉదయం ప్రారంభమైన ఏపీ టూరిజం కార్యాలయానికి సాయంత్రం ఏడింటికి చేర్చుతారు.
టిక్కెట్ ధర ఇలా: పెద్దలకు రూ.1250, పిల్లలకు రూ.1050. ఈ టికెట్ ధరలోనే అల్పాహారం, భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు.
- తెలంగాణ మీదుగా రావాలంటే: తెలంగాణనుంచి వచ్చే పర్యాటకులు పోచవరం కంట్రోల్‌పాయింట్ ద్వారా పాపికొండలు విహారయాత్ర(Papikondalu boating start)కు వెళ్లవచ్చు.
- టికెట్లు ఇలా..: పాపికొండలు యాత్రకు టికెట్ల కోసం aptdc.in ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. సరాసరి టికెట్లు కొనాలంటే వివిధ ప్రాంతాల్లో ఏపీటీడీసీ కార్యాలయాల్లో అవకాశముంది. పర్యాటకశాఖతో పాటు ప్రైవేటువి కలిపి మొత్తం 11 బోట్లకు అనుమతులిచ్చినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
- ప్రస్తుతం 40 మందికి అవకాశం: విహారయాత్రకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు మొదలయ్యాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 40 మంది ప్రయాణికులు వెళ్లడానికి వీలుగా సర్ ఆర్ధర్‌కాటన్ బోటు అందుబాటులో ఉంది. త్వరలో 90 సీట్ల సామర్థ్యమున్న హరిత బోటు అందుబాటులోకి వస్తుంది.
- తోట వీరనారాయణ, డీవీఎం, ఏపీటీడీసీ
ఇదీ చదవండి: TS Eamcet counselling 2021: ఎంసెట్ తుది విడత సీట్లు ఎన్నంటే?