ETV Bharat / city

ఏపీ బడ్జెట్: మూడు నెలలకు రూ. 86 వేల కోట్లు ! - ఓటాన్ అకౌంట్ బడ్జెట్

ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. రూ. 86 వేల కోట్ల మేర రూపొందించిన బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్‌కు పంపింది. గవర్నర్ ఆమోదించాక ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది.

AP Budget, Otan‌ Account‌ Budget
ఏపీ బడ్జెట్, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్
author img

By

Published : Mar 27, 2021, 9:28 AM IST

ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆర్డినెన్సు రూపంలో దీన్ని జారీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆర్థికశాఖ అధికారులు ఆర్థిక బిల్లును రూపొందించి మూడు నెలల కాలానికి ఎంత మొత్తం అవసరమవుతుందో లెక్క తేల్చి దస్త్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ వద్దకు పంపారు. ఆయన పరిశీలించి శుక్రవారం ఆమోదించిన తర్వాత ఆన్‌లైన్‌లోనే మంత్రులకూ ఆ ఫైలును పంపారు. వారి అంగీకారంతో ఓటాన్‌ అకౌంట్‌ ఆర్డినెన్సును మంత్రిమండలి ఆమోదించినట్లయింది. ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి అంటే జూన్‌ నెలాఖరు వరకు రమారమి రూ.86 వేల కోట్ల మేర ఓటాన్‌ అకౌంట్‌కు ఆమోదం పొందినట్లు సమాచారం. దీన్ని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదానికి పంపారు. ఆయన ఆమోదం తర్వాత ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేస్తుంది.

వరుసగా మూడో ఏడాదీ

ఏపీలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడానికి వీలు చిక్కలేదని, అందువల్ల ఓటాన్‌ అకౌంట్‌ను ఆమోదిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటోంది.

కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, ఇతర చెల్లింపులు జరపాలన్నా బడ్జెట్‌ ఆమోదం తప్పనిసరి. అది వీలుకానప్పుడు ఓటాన్‌ అకౌంట్‌ ఆమోదిస్తారు.

  • రాష్ట్రంలో వరుసగా మూడేళ్లుగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆమోదించడం ఇదే తొలిసారి.
  • 2019-20 ఆర్థిక సంవత్సరంలో సాధారణ ఎన్నికల కారణంగా తొలుత మూడు నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఆనక పూర్తిస్థాయి బడ్జెట్‌ను కొత్త ప్రభుత్వం ఆమోదించుకుంది.
  • 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా బడ్జెట్‌ సమావేశాలకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో ఆ ఏడాదీ తొలుత ఓటాన్‌ అకౌంట్‌కు ఆర్డినెన్సు ఇచ్చారు.
  • ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఓటాన్‌ అకౌంట్‌ను ఆర్డినెన్సు రూపంలో జారీ చేస్తున్నారు. జూన్‌ నెలాఖరులోపు తిరిగి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సి ఉంటుంది.
  • ఇదీ చదవండి : బడ్జెట్‌ అంచనాలు.. వాస్తవాల మధ్య అంతరం తగ్గాలి: కాగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.