ETV Bharat / city

అంతర్వేది ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని దివ్య రథం దగ్ధమైన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. నెల్లూరు, అంతర్వేది దేవస్థానాల్లో రథాలను దగ్ధం చేసిన నిందితులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

అంతర్వేది దివ్య రథం దగ్ధం:  కొనసాగుతున్న దర్యాప్తు

author img

By

Published : Sep 8, 2020, 11:29 AM IST

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని దివ్య రథం దగ్ధమైన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. రెండో రోజైన సోమవారం ఆలయ ప్రాంగణంలో భక్తులతోపాటు వాహన సేవకులు, బ్రాహ్మణ సంఘాలు, భాజపా, జనసేన పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులను మోహరించారు. ఏలూరు రేంజి డీఐజీ కె.వి.మోహన్‌రావు, పోలీసు అధికారుల బృందం రథాన్ని సోమవారం మరోమారు పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే మానసిక రోగిని, రథం భద్రపరిచే షెడ్డు పైభాగంలోని తేనెపట్టును తీయడానికి ప్రయత్నించే క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చన్న అనుమానంతో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలయ ఉద్యోగులనూ విచారించారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ డైరెక్టర్‌ రాజేంద్ర సెసైన్‌ ఆధ్వర్యంలోని బృందం కాలిన రథం విడి భాగాలను సేకరించింది. దేవాదాయశాఖ ఆర్‌జేసీ భ్రమరాంబ రథాన్ని పరిశీలించి సిబ్బందిని ప్రశ్నించారు.

కొత్త రథాలు చేయిస్తాం: మంత్రి వెలంపల్లి

నెల్లూరు, అంతర్వేది దేవస్థానాల్లో రథాలను దగ్ధం చేసిన నిందితులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం తెదేపా సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనలను చూపి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం విచారకరమన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించి అంతర్వేది ఘటనలో ఆలయ ఈవో చంద్రశేఖర్‌ను బదిలీ చేయడంతోపాటు, అలసత్వం ప్రదర్శించిన సిబ్బందిని సస్పెండు చేశామన్నారు. దేవాలయాల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. రూ.95 లక్షలతో అంతర్వేదిలో, రూ.80లక్షలతో నెల్లూరు ఆలయంలో రథాలను తయారు చేయిస్తున్నట్లు వివరించారు.

సీబీఐ దర్యాప్తు జరపాలి: తెదేపా

దివ్య రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ విచారణ చేయాలని తెదేపా నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్‌ చేశారు. తెదేపా నిజ నిర్ధారణ కమిటీ సోమవారం సంఘటనా స్థలాన్ని సందర్శించింది. అనంతరం చినరాజప్ప విలేకర్లతో మాట్లాడుతూ రథం దగ్ధం కావడం కుట్రలో భాగమేనని ఆరోపించారు. తేనెపట్టుకు పొగపెట్టారని, షార్ట్‌సర్క్యూట్‌ జరిగిందనే సాకులతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేయవద్దన్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రసన్న ఆంజనేయస్వామి రథం దగ్ధం చేయడం, పిఠాపురంలోని ఆలయాల్లో 23 విగ్రహాలను నేలమట్టం చేయడం కూడా కుట్రతో కూడిన పనులేనని ఆరోపించారు. అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ కూడా మాట్లాడారు.

ప్రాథమిక విచారణ పూర్తి: మంత్రి చెల్లుబోయిన

అంతర్వేది ఘటనకు సంబంధించి ప్రాథమిక విచారణ పూర్తైందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.

ఇదీ చదవండి: శ్రీశైలంలో పురాతన తామ్ర శాసనాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.