కరోనా భయం కొంతమందికి వరంగా మారింది. రూ.రెండొందలు ఖర్చు పెట్టండి నెల రోజులు కొవిడ్ వైరస్ మీ జోలికిరాదు అంటూ మార్కెట్లోకి కరోనా వైరస్ షట్ ఔట్ పేరుతో ట్యాగులు వచ్చాయి. ఏపీ ప్రకాశం జిల్లా చీరాలలోని కొన్ని ఔషధ దుకాణాల్లో ఈ అమ్మకాలు సాగుతున్నాయి. ఒక్కొక్కటి 150 రూపాయల నుంచి 200 వరకు అమ్ముతున్నారు. వీటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు మెడలో వేసుకుని తిరుగుతున్నారు.
ఓ వైపు టీకా... మరోవైపు ట్యాగ్
ఒక పక్క కరోనా మహమ్మారికి టీకా కనిపెట్టే పనిలో బయో సంస్థలు నిమగ్నమైతే.. ఈ ట్యాగ్ ధరిస్తే కరోనా రాదు అని తప్పుడు ప్రచారాలు సాగుతున్నాయి. ట్యాగ్ కవర్‌పై మేడిన్ జపాన్ అని ఉంది. విజయవాడ నుండి తీసుకొచ్చి అమ్ముతున్నామని అమ్మకందారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి : ఏ చావైనా.. కొవిడ్ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల