ETV Bharat / city

కూలిన పురాతన ఇంటి గోడ.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్​ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరపిలేకుండా వర్షాలు కురవడంతో శిథిలావస్థకు చేరిన ఇళ్లు, భవనాలు కుప్పుకూలుతున్నాయి. చార్మినార్ సమీపంలో ఓ పురాతన ఇంటి గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

author img

By

Published : Oct 20, 2020, 11:37 AM IST

old house in old city collapse due to heavy rain
కూలిన పురాతన ఇంటి గోడ.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్​లో కురుస్తున్న భారీ వర్షాలకు పాతబస్తీ చార్మినార్ సమీపంలో ఓ పురాతన ఇంటి పై అంతస్తు గోడ కూలిపోయింది. ఆ ఇంటి కింద ఉన్న దుకాణంతోపాటు ఓ కారు ధ్వంసం అయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

శిథిలావస్థలో ఉన్న గోడలు ప్రమాదకరంగా మారడంతో అటుగా వెళ్లే ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎడతెరపిలేకుండా వర్షాలు కురవడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: భారీ వర్షాల ఎఫెక్ట్​: పాతబస్తీ ఆగమాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.