ETV Bharat / city

విద్యుత్​ ఉద్యోగులను అడ్డుకోవద్దు: ఎన్​పీడీసీఎల్​ సీఎండీ - npdcl cmd request police

విద్యుత్​ ఉద్యోగులను అడ్డుకోవద్దని ఎన్​పీడీసీఎల్​ సీఎండీ గోపాల్​రావు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తమ విద్యుత్​ సంస్థకు చెందిన లారీలను ఆపొద్దని.. విద్యుత్​ సరఫరాలో అంతరాయాలు లేకుండా ఉండేందుకు తాము నిరంతరం కృషిచేస్తున్నట్లు తెలిపారు.

npdcl cmd
విద్యుత్​ ఉద్యోగులను అడ్డుకోవద్దు
author img

By

Published : May 24, 2021, 6:17 AM IST

విద్యుత్ ఉద్యోగులు అత్యవసర సేవల కిందకు వస్తారని.. వారిని విధులకు వెళ్లకుండా అడ్డుకోవద్దని ఎన్​​పీడీసీఎల్ సీఎండీ గోపాల్​రావు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

సిరిసిల్లలో ఉన్న విద్యుత్ స్తంభాల తయారీ కేంద్రం నుంచి మంచిర్యాలకు వయా.. వేములవాడ, జగిత్యాల మీదుగా వెళ్తున్న స్తంభాల లోడ్​ లారీని.. వేములవాడ గుట్ట, నల్గొండ గ్రామ చెక్​పోస్ట్​, జగిత్యాల బైపాస్​ వద్ద పోలీసులు ఆపిన విషయాన్ని సిబ్బంది తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. లాక్​డౌన్​ సమయంలో బయటకు రావొద్దని హెచ్చరించి పంపినట్లు తెలిసిందన్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన ఆవాసాల విద్యుదీకరణ పనుల్లో భాగంగా స్తంభాలు తీసుకెళ్తున్న లారీలను ఆపడం సరికాదన్నారు.

విద్యుత్ వినియోగదారులకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలంటే.. స్తంభాలు వంటి సామగ్రి అవసరం ఉంటుందని.. తమ వాహనాలను ఆపవద్దని.. సంబంధిత పోలీసు అధికారులకు గోపాల్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి: విమర్శలు మూటగట్టుకుంటున్న పోలీసుల 'లాఠీ' ప్రతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.