డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు.
విడత | రిజిస్ట్రేషన్లు | వెబ్ ఆప్షన్లు | సీట్ల కేటాయింపు |
తొలి విడత | జులై 1 నుంచి 15 | జులై 3 నుంచి 16 | జులై 22 |
రెండో విడత | జులై 23 నుంచి 27 | జులై 24 నుంచి 29 | ఆగస్టు 4 |
మూడో విడత | ఆగస్టు 5 నుంచి 10 | ఆగస్టు 6 నుంచి 11 | ఆగస్టు 18 |
తొలివిడత రిజిస్ట్రేషన్లు జులై 1 నుంచి 15 ప్రారంభం కానున్నాయి. జులై 3 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశమున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరగనున్నట్లు వెల్లడించారు.
జులై 23 నుంచి 27 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. జులై 24 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 4న డిగ్రీ సీట్ల కేటాయింపు నిర్వహించనున్నట్లు కన్వీనర్ తెలిపారు.
మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 5 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. ఆగస్టు 6 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశమున్నట్లు కన్వీనర్ చెప్పారు. ఆగస్టు 18న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరగనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.