ETV Bharat / city

కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నర్సింగ్ సిబ్బంది

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కనీసం వేతనం అమలయ్యేలా చూడాలంటూ నిమ్స్​ వైద్యశాలలో నర్సింగ్​ సిబ్బంది ఆందోళన బాటపట్టారు.

author img

By

Published : Feb 6, 2020, 10:48 PM IST

NIMS NURSING STAFF PROTEST OVER MINIMUM PAY SCALE
కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నిమ్స్​ సిబ్బంది

హైదరాబాద్​లోని నిమ్స్​ (నిజాం ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​)లో నర్సింగ్​ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. కేంద్రప్రభుత్వం సూచించినట్లుగా... ప్రైవేటు ఆసుపత్రుల్లో కనీస వేతనం రూ.20వేలు అమలయ్యేలా చూడాలంటూ వైద్యశాల ప్రాంగణంలో నిరసనకు దిగారు.

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం నర్సింగ్​ సిబ్బందికి నెలకు రూ. 20వేలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఓ పక్క నిత్యవసర వస్తువుల ధరలు పైపైకి ఎగబాకుతున్నా.. అరకొర వేతనాలతోనే జీవితాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. కనీస వేతనానికి నోచుకోవడం లేదని వాపోయారు.

2016 ఫిబ్రవరి 24న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నర్సింగ్​ సిబ్బందికి కనీసం వేతనం కింద రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లేకుంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇవీచూడండి: ఆస్తి కోసం అమ్మను, చెల్లిని చంపేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.