NIGHT CURFEW: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానికంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గురువారం సూచించింది.
- ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.
- యూపీలోనూ కర్ఫ్యూ: కేంద్రం సూచనల నేపథ్యంలో.. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. డిసెంబర్ 25 నుంచి రాష్ట్రంలో రాత్రి 11-5 గంటల మధ్య నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. వివాహ వేడుకలకు 200 మంది కంటే ఎక్కువ మంది హాజరుకారాదని తేల్చిచెప్పారు.
- Maharashtra Corona guidelines: మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. క్రిస్మస్, నూతర సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రజల రద్దీకి అడ్డుకట్ట వేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది.
- Odisha Government covid-19 restrictions: వేడుకల నేపథ్యంలో కరోనా కట్టడికి.. ఒడిశా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి జనవరి 2 వరకు రాష్ట్రంలో ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. బయట ప్రజలు గుమికూడటం, సంగీత ప్రదర్శనలు, హోటల్స్, క్లబ్స్, రెస్టారెంట్లు, పార్కుల్లో వేడుకలపై నిషేధం విధించింది.
ఇవీ చూడండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల వాయిదా తప్పదా?