ETV Bharat / city

Curfew Extend: ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటి వరకంటే?

author img

By

Published : Jul 30, 2021, 11:39 AM IST

ఏపీలో రాత్రి కర్ఫ్యూను ఆగస్టు 14 వరకు పొడిగించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.

curfew
కర్ఫ్యూ

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్​ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు వారాల పాటు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 14 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎస్పీ, సీపీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆగస్టు 14 వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి.. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర సర్కార్​హెచ్చరించింది.

ఇదీ చదవండి: Vulture: రాబందుల కోసం మహారాష్ట్రను అర్థించిన తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.