ETV Bharat / city

ఎన్​ఐఏ అదుపులో నకిలీ కరెన్సీ నోట్ల ముఠా కీలక నిందితుడు - hyderabad crime news

నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాలో కీలక సూత్రధారిని ఎన్​ఐఏ అరెస్ట్​ చేసింది. రెండేళ్ల గాలించిన జాతీయ దర్యాప్తు సంస్థ.. సరిహద్దు భద్రతా దళం సాయంతో అదుపులోకి తీసుకొంది.

nia
ఎన్​ఐఏ అదుపులో నకిలీ కరెన్సీ నోట్ల ముఠా కీలక నిందితుడు
author img

By

Published : Sep 4, 2020, 7:20 AM IST

బంగ్లాదేశీయులతో కలిసి నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా కీలక సూత్రధారిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. పశ్చిమ బంగాలోని మాల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొంది.

విశాఖపట్నంలో 2018లో డీఆర్​ఐ అధికారులు భారీగా నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల ముద్రణ, చలామణిలో బంగ్లాదేశ్​కు చెందిన కొందరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

మహమ్మద్ మహబూబ్​బేగ్, సయ్యద్ ఇమ్రాన్, ఫిరోజ్ షేక్, తాజాముల్ షేక్​పై విజయవాడ, చెన్నై కోర్టుల్లో ఛార్జ్​ షీట్లు దాఖలయ్యాయి. మహమ్మద్ మహబూబ్​బేగ్, సయ్యద్ ఇమ్రాన్​లకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. మిగతా ఇద్దరిపై విచారణ కొనసాగుతోంది.

నిందితులు.. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నకిలీ కరెన్సీ నోట్లు సేకరించి.. అనుచరులతో కలిసి దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో చలామణి చేస్తున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది.

వీరి కోసం రెండేళ్లుగా గాలించిన జాతీయ దర్యాప్తు సంస్థ.. పట్టించిన వారికి 25 వేల రివార్డును ప్రకటించింది. ఎట్టకేలకు బీఎస్ఎఫ్ సహకారంతో సరిహద్దుల్లో అరెస్టు వీరిని చేసింది.

ఇవీచూడండి: హైఅలర్ట్​: ఐటీబీపీకి హోంశాఖ కీలక ఆదేశాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.