రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న వెల్లడించారు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఇవాళ, రేపు ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో... ఒకటి రెండు ప్రదేశాల్లో ఈ పరిస్థితి ఉంటుందని నాగరత్న తెలిపారు.
ఈ రోజు పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాప్తించి ఉందని ఐఎండీ సంచాలకులు వివరించారు.