ఏపీలో కొత్తగా 94 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 8,89,503 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 7,168 మంది మృతి చెందారు.
కొవిడ్ నుంచి మరో 66 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 8.81 లక్షల మందికి పైగా బాధితులు వైరస్ బారినుంచి నుంచి విముక్తి పొందారు. 24 గంటల వ్యవధిలో 32,494 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 38 లక్షలు దాటాయి.