కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉండాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆకాంక్షించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2020 చాలా పాఠాలు నేర్పిందని ఆయన గుర్తుచేసుకున్నారు. హైటెక్ సైబర్ టవర్స్ వద్ద సైబరాబాద్ సీపీ సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పరిశీలించారు.
నగరంలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు చేపట్టామని.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 336 కేసులు నమోదు చేశామన్నారు. పరిశుభ్రత, ప్రకృతిని ప్రేమించడం, ఇతరులకు సహాయ పడటం.. వంటివి గతేడాది నేర్పిందన్నారు. తాగి వాహనాలు నడిపి అందమైన కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
నూతన సంవత్సరం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వేడుకల్లో ప్రమాదాలను నివారించేందుకు ప్లైఓవర్లను మూసివేశామని ప్రకటించారు. బేగంపేట్ ప్లై ఓవర్ మినహాయించి, తెలుగుతల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, పంజాగుట్ట ప్లైఓవర్లను, టాంక్ బండ్, నెక్లెస్ రోడ్లను, దుర్గంచెరువు తీగల వంతెనను మూసివేశారు. గురువారం రాత్రి 10గంటల నుంచి శుక్రవారం ఉదయం ఐదు గంటల వరకు మూసివేశారు.
ఇదీ చూడండి: కన్న కొడుకును పట్టించిన పోలీస్