ETV Bharat / city

New power charges: ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమలు.. కానీ..!

New power charges in telangana: ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమలు కానున్నాయని ఈఆర్సీ ఛైర్మన్​ శ్రీరంగారావు తెలిపారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, సిరిసిల్ల సెస్ మూడు సంస్థలు ఇవాళ వార్షిక ఆదాయ అవసరాలను సమర్పించాయి. టారీఫ్​ ప్రపోజల్స్​ను సమర్పించలేదు. వీలైనంత తొందరగా టారీఫ్ సమర్పిస్తే.. మార్చి 31 వరకు నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.

New power charges in telangana from april 1st

author img

By

Published : Nov 30, 2021, 10:30 PM IST

New power charges in telangana: డిస్కంలు వీలైనంత త్వరగా టారీఫ్ ప్రపోజల్స్​ను సమర్పించాలని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు కోరారు. 2022-23 ఏడాదికి సంబంధించి ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, సిరిసిల్ల సెస్ మూడు సంస్థలు ఇవాళ వార్షిక ఆదాయ అవసరాలను సమర్పించాయి. హైదరాబాద్​ లక్డీకాపూల్​లోని ఈఆర్సీ కార్యాలయంలో ఏఆర్​ఆర్​కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. డిస్కంలు కేవలం ఏఆర్​ఆర్​లు మాత్రమే సమర్పించి.. టారీఫ్ ప్రపోజల్స్ సమర్పించకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. ఏఆర్​ఆర్​ మాత్రమే సమర్పించి.. టారీఫ్​ ప్రపోజల్స్​ ఇవ్వకపోతే ఈఆర్సీ ముందుకు పోలేదని ఆయన స్పష్టం చేశారు.

ఏప్రిల్​ 1 నుంచి కొత్త ఛార్జీలు..

వీలైనంత తొందరగా డిస్కంలు టారీఫ్ సమర్పిస్తే.. వాటిని తమ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఆ తర్వాత ప్రజలకు తెలియజేసేందుకు పత్రికా ప్రకటన కూడా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత షెడ్యూల్ నిర్ణయించి మార్చి 31లోపు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి.. కమిషన్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని శ్రీరంగారావు పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమలవుతాయన్నారు. వీలైనంత త్వరగా డిస్కంలు విద్యుత్ టారీఫ్​లు సమర్పించాలని సూచించారు.

డిస్కంలు సమర్పించిన లెక్కలు..

SPDCL and NPDCL ARR: రెండు డిస్కంలు(ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్​) కలిపి 2021-22కు ఏఆర్​ఆర్ రూ.45,618 కోట్లు, 2022-23కు సంబంధించి రూ.53,053 కోట్లు చూపించారని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ 2021-22 ఏడాదికి గానూ రెండు డిస్కంలు కలిపి రూ.5,652లు కోట్లు, 2022-23 ఏడాదికి గానూ రూ.5,652 కోట్లు చూపెట్టారని వివరించారు. రెండు డిస్కంలు సమర్పించిన లెక్కల వివరాలు...

  • వార్షిక ఆదాయ అవసరాలు (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్) ఏఆర్​ఆర్​:

2021-22కు రూ.45,618 కోట్లు

2022-23కు రూ.53,053 కోట్లు

  • రెవెన్యూ గ్యాప్ ఎస్పీడీసీఎల్ :

2021-22 ఏడాదికి రూ.7,008 కోట్లు

2022-23 ఏడాదికి రూ.7,731 కోట్లు

  • రెవెన్యూ గ్యాప్ ఎన్పీడీసీఎల్ :

2021-22 ఏడాదికి రూ.3,616 కోట్లు

2022-23 ఏడాదికి రూ.3,197 కోట్లు

  • రెవెన్యూ గ్యాప్ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ రెండు డిస్కంలు కలిపి :

2021-22 ఏడాదికి గానూ రెవెన్యూ గ్యాప్ రెండు డిస్కంలు కలిపి రూ.10,624 కోట్లు

2022-23 ఏడాదికి గానూ రెవెన్యూ గ్యాప్ రెండు డిస్కంలు కలిపి రూ.10,928 కోట్లు

  • రెండు డిస్కంలకు కలిపి మొత్తం ఆదాయం:

2021-22 ఏడాదికి గానూ రూ.29,343 కోట్లు

2022-23 ఏడాదికి గానూ రూ.36,474 కోట్లు

  • ప్రభుత్వ సబ్సిడీ : (వ్యవసాయం, నీటిపారుదల తదితరవి కలిపి..)
ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్మొత్తం
2021-224,254 కోట్లు1,398 కోట్లు5,652 కోట్లు
2022-234,254 కోట్లు1,398 కోట్లు 5,652 కోట్లు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.