నేరేడ్మెట్ 136వ డివిజన్ ఫలితాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు నిలిపివేయడంపై డివిజన్ భాజపా అభ్యర్థి ప్రసన్ననాయుడు స్పందించారు. ఫలితం నిలిపివేయడానికి రిటర్నింగ్ అధికారులే కారణమని ఆమె ఆరోపించారు. రిపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.
కౌంటింగ్ చేసేప్పుడు '500 పైగా చెల్లని ఓట్లను తెరాస డబ్బాలో వేయండి' అని ఎలక్షన్ అధికారులు చెప్పడంతో అభ్యంతరం తెలిపానని ప్రసన్ననాయుడు స్పష్టం చేశారు. స్వస్తిక్ ముద్ర లేకుండా ఏదో ఒక ముద్ర ఇవ్వడం న్యాయమా అని ప్రశ్నించారు. తనను ఎలాగైన ఓడించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుట్ర చేశారని ఆరోపించారు.
ఇదీ చూడండి: ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా భాజపాదే విజయం: లక్ష్మణ్