ETV Bharat / city

ప్రత్యేక రాష్ట్రంలో పెరిగిన రహదారులు.. - తెలంగాణలో పంచాయతీ రాజ్​ రహదారులు

తెలంగాణా ఏర్పడిన తరువాత మెరుగైన రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధాన రహదారులను జాతీయ రహదారుల పరిధిలోకి తీసుకురావటం, జిల్లా, మండల స్థాయిలో రహదారి వ్యవస్థను మెరుగుపరచటం ద్వారా మౌళిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని ఆరేళ్ల పాలన సందర్భంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. రహదారుల పరిస్థితి మెరుగుపర్చడం ద్వారా రాష్ట్రంలో ప్రగతిబాటలు నిర్మించాలని నిర్ణయించింది.

national and other roads increase in divided telangana
ప్రత్యేక రాష్ట్రంలో పెరిగిన రహదారులు..
author img

By

Published : Jun 2, 2020, 5:35 AM IST

రహదారుల అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా గుర్తించింది. రాష్ట్రావిర్భావం నుంచి జాతీయ రహదారులు విస్తరణ, పంచాయతీరాజ్-ఆర్​అండ్​బీ రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికు రచించింది. అందులో భాగంగానే ఆర్​అండ్​బీ పరిధిలోని 7,554 కిలోమీటర్ల స్టేట్‌ రోడ్‌ల అభివృద్ధికి రూ. 11,257 కోట్లు విడుదల చేసింది. రూ.7,463 కోట్లతో 2020 మార్చి నాటికి 5,453 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేశారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.1868 కోట్లు ఖర్చు చేశారు.

నదులు, రహదారులపై వంతెనలు

మంజీర ,గోదావరి, మానేరు, ప్రాణహిత, మున్నేరు,అకేరు, మూసి, తుంగభద్ర తదితర నదులపై రూ. 9,084 కోట్ల వ్యయంతో 26 భారీ వంతెనలు నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే 16 నిర్మాణాలను పూర్తి చేశారు. 2018-19లో బడ్జెట్​లో రూ. 5,575 కోట్లు, 2019-20 లో రూ.2,219 కోట్లు, 2020-21లో రూ.3493.67 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్​లోనే కొత్త పంచాయతీల్లో రహదారులకు రూ.5 వేల కోట్లు, సీసీ రోడ్లకు మరో రూ.600 కోట్లు కేటాయించారు.

తెలంగాణ ఏర్పడే నాటికి 143 మండల కేంద్రాలకు జిల్లా కేంద్రం నుంచి డబుల్ లేన్ బీటీ రోడ్లు లేవు. రూ.2,518 కోట్ల వ్యయంతో 1,875 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్లుగా మార్చి.. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలకు జిల్లా కేంద్రాల నుంచి డబుల్ లేన్ రోడ్డు సౌకర్యం సమకూర్చింది. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడానికి రోడ్లున్నప్పటికీ వాగులు, నదుల మీద అవసరమైనన్ని వంతెనల లేకపోవడం వల్ల వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది. అందుకే ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులు, ఆర్​అండ్​బీ రహదారులు, పంచాయతీ రాజ్ రహదారులపై వంతెనలు నిర్మించాలని నిర్ణయించింది. ఆర్​అండ్​బీ పరిధిలో 511, పంచాయతీరాజ్ పరిధిలో 631 వంతెనల నిర్మాణం చేపట్టింది. కొత్తగా ఆర్వోబీలను నిర్మించింది.

పెరిగిన జాతీయ రహదారులు

రాష్ట్ర ఆవిర్బావం నాటికి కేవలం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉండేవి. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే కొత్తగా రూ.11,983 కోట్ల వ్యయంతో 3,150 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రం మంజూరు చేసింది. 57 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో మొత్తం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరైతే, కేవలం నాలుగున్నరేండ్లలో అంతకన్నా ఎక్కువగా 3,150 కిలోమీటర్ల నిడివి కలిగిన 36 జాతీయ రహదారులు మంజూరయ్యాయి. దీనివల్ల నేడు తెలంగాణలో మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్​వర్క్ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే, తెలంగాణ రాష్ట్రం సగటు 5.02 కిలోమీటర్లు. జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ ఏర్పడే నాటికి దక్షిణాదిలో అట్టడుగున ఉన్న రాష్ట్రం.. నేడు అగ్రభాగంలో నిలవడమే కాకుండా, దేశ సగటును మించింది. ఇవేకాకుండా రాష్ట్రంలో రూ.13 వేల కోట్ల వ్యయం కాగల మరో 8 జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

రహదారుల విస్తరణ

రాష్ట్రంలో ఆర్​అండ్​బీ పరిధిలో 24,495 కిలోమీటర్ల రహదారులున్నాయి. 2,552 కిలోమీటర్ల స్టేట్ హైవేలు, 11,967 కిలోమీటర్ల జిల్లా రహదారులు, 10,335 కిలోమీటర్ల ఇతర రహదారులు ఉన్నాయి. అయితే ఈ మొత్తం రహదారుల్లో 16,864 కిలోమీటర్ల రహదారులు... అంటే 70 శాతం రోడ్లు సింగిల్ లేన్ రోడ్లుగానే ఉన్నాయి. ఇవి పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చలేకపోయాయి. ఈ పరిస్థితిని గ్రహించిన ప్రభుత్వం సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా మార్చడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే క్రమంలో ఆర్ఓబీలతోపాటు పెద్దఎత్తున వంతెనల నిర్మాణాలు కూడా చేపట్టింది. రూ.7,029 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో ఆర్ అండ్ బి పరిధిలో రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టింది.

రాష్ట్రంలో 67,714 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారులున్నాయి. ఇందులో 31,144 కిలోమీటర్ల రహదారులు మట్టి, 13,103 కిలో మీటర్లు కంకర రోడ్లు. మిగతా 23,467 కిలోమీటర్లు బీటీ రోడ్లయినప్పటికీ... అవన్నీ అధ్వాన్న స్థితిలో ఉండేవి. మట్టి రోడ్లతోపాటు పాడైన రహదారులను బీటీ రోడ్లుగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 2014 నుంచి జనవరి 2019 నాటికి పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి రూ. 9,807 కోట్ల ఖర్చు చేశారు. 10 వేల కిలోమీటర్ల మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా జనవరి 2019 నాటికి 8,042 కిలోమీటర్ల పని పూర్తయింది. 15,958 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లకు మరమత్తులు చేపట్టగా, 14,583 కిలోమీటర్ల మేర పని పూర్తయింది.

సువిశాల క్యాంపు కార్యాలయాలు

రాష్ట్రవ్యాప్తంగా 511 వంతెనల నిర్మాణం చేపట్టగా... జనవరి 2019 నాటికి 312 వంతెనలు పూర్తై, 199 వంతెనల నిర్మాణ పనులు వివిధ దశల్లో వున్నాయి. ఈ వంతెనల వద్ద నీటి నిల్వలకు వీలుగా 312 చెక్ డ్యాములు నిర్మించారు. మరో 1235 చెక్ డ్యాములు నిర్మించాల్సి ఉంది. రాష్ట్రంలోని 12,751 గ్రామపంచాయతీలకు ఖచ్చితంగా బీటీ రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020-21 బడ్జెట్లో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.600 కోట్లు కేటాయించారు. శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా... విశాలమైన నివాసాలు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఒక్కోటి కోటి రూపాయల వ్యయంతో 500 గజాల విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయాలు నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి: కార్పొరేట్​కు దీటుగా దూసుకెళ్తున్న గురుకులాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.