ETV Bharat / city

rrr: 'ప్రవీణ్‌కుమార్‌ రాజకీయ దృక్పథం.. నా ఆలోచనా విధానం ఒక్కటే..' - rs praveen kumar latest news

ఆర్ఎస్​ ప్రవీణ్​​కుమార్ రాజకీయాల్లోకి రావడంపై ఏపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ప్రవీణ్​కుమార్​కు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో ప్రవీణ్​కుమార్ రాణించాలని ఆక్షాంక్షించారు.

rrr: 'ప్రవీణ్‌కుమార్‌ రాజకీయ దృక్పథం.. నా ఆలోచనా విధానం ఒకేలా..'

author img

By

Published : Aug 9, 2021, 4:31 PM IST

Updated : Aug 9, 2021, 4:55 PM IST

విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రవేశంపై ఆంధ్రప్రదేశ్​కు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. గతంలో పోలీసు అధికారిగా ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడటం సరికాదని తాను ప్రవీణ్ కుమార్​ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి.. మనస్ఫూర్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​కు పాలిటిక్స్​లోకి స్వాగతం పలుకుతున్నానని చెప్పారు.

rrr: 'ప్రవీణ్‌కుమార్‌ రాజకీయ దృక్పథం.. నా ఆలోచనా విధానం ఒకేలా..'

ప్రవీణ్​కుమార్​ గొప్ప నాయకుడిగా ఎదగాలని ఆశిస్తున్నానని రఘురామ పేర్కొన్నారు. బీఎస్పీలో చేరిన సందర్భంగా.. తనపై ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా అభిప్రాయం చెబుతున్నానని ఆయన వివరించారు.

ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​లో దాగి ఉన్న రాజకీయ నాయకుడిని నేను అప్పుడే చూశా. అధికారిగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు మాట్లాడవద్దని చెప్పా. ఐ వెల్​ కమ్​ హిమ్. ఆర్​ఎస్ ప్రవీణ్​కుమార్ నిన్న నా గురించి మాట్లాడారు కాబట్టి నేను కూడా ఆయన గురించి మాట్లాడుతున్నా. ఆయన ఆలోచనా విధానంలో ఎలాంటి తప్పులేదు. ఆయన ఐడియాలజీ, నా ఐడియాలజీలో పెద్దగా మార్పులేదు. ప్రవీణ్​కుమార్​ ఎప్పుడూ ఏనుగుల మీదే తిరగాలని ఆకాంక్షిస్తున్నా.-రఘురామ, నరసాపురం ఎంపీ

బీఎస్పీ గూటికి..

మాజీ ఐపీఎస్​ ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో చేరారు. ఆదివారం నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో నిర్వహించిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్​, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్.. ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్​ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి.. సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్ కుమార్‌ను బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ప్రకటించారు.

సంబంధిత కథనాలు..

RS PRAVEEN KUMAR: నల్గొండ సభలో బీఎస్పీలో చేరిన ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌

Praveen kumar: తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతోంది: ఆర్​ఎస్ ప్రవీణ్​ కుమార్

RS Praveen Kumar: 'ప్రైవేట్​ రంగంలోనూ రిజర్వేషన్లు​ మన హక్కు'

Last Updated : Aug 9, 2021, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.