ETV Bharat / city

న్యూ ఇయర్ వేళ మళ్లీ డ్రగ్స్ జోరు..!

మహానగరంలో మరో మాదక ద్రవ్యాల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈకేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు... దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తెలిపారు. పట్టుబడిన వాటి విలువ సుమారు 2లక్షల వరకు ఉంటుందని సీపీ వెల్లడించారు.

Narcotics gang in the metropolis ..!
మహానగరంలో మాదక ద్రవ్యాల ముఠా..!
author img

By

Published : Dec 20, 2019, 7:38 PM IST

Updated : Dec 20, 2019, 11:27 PM IST

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరిని దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి దాదాపు 2 లక్షల విలువ గల మత్తు పదార్థాలు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి ఫ్రాన్సిస్ జేవియర్ సికింద్రాబాద్​ కార్ఖానాలో నివాసం ఉంటున్నట్లు సీపీ అంజనీకుమార్​ తెలిపారు. ఇంటర్ తర్వాత చదువు మానేసి.. మత్తు పదార్థాలకు బానిసైనట్లు వెల్లడించారు.

మూడేళ్లుగా మత్తు పదార్థాల రవాణా

సికింద్రాబాద్​కు చెందిన ఆర్ఎం గౌడ్ అనే వ్యక్తితో జేవియర్​కు పరిచయం ఏర్పడినట్లు సీపీ పేర్కొన్నారు. గౌడ్ గత మూడేళ్లుగా గోవాలో ఉంటూ హైదరాబాద్​కు నిత్యం మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. బస్సు ద్వారా నగరానికి తీసుకొచ్చి స్నేహితులకు, తెలిసిన వాళ్లకు విక్రయించినట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా.. పక్కా సమాచారం మేరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అంజనీకుమార్​ వెల్లడించారు. ప్రస్తుతం గౌడ్, అక్బర్, సత్తార్ పరారీలో ఉన్నారని.. వీరి కోసం గాలిస్తున్నామన్నారు.

మహానగరంలో మాదక ద్రవ్యాల ముఠా..!

ఇవీ చూడండి: అఫ్జల్‌గంజ్‌లో రూ.1.50 కోట్ల నగదు సీజ్‌

Intro:Body:Conclusion:
Last Updated : Dec 20, 2019, 11:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.