ETV Bharat / city

అబ్దుల్ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సీఐ సస్పెండ్.. - నంద్యాల వార్తలు

కర్నూలు జిల్లా నంద్యాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ సోమశేఖర్​రెడ్డి సస్పెండయ్యారు. నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాంతో పాటు అతని కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారణమైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో ఆయనను సస్పెండ్​ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆత్మహత్యకు ముందు అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతో తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై ఇద్దరు ఐపీఎస్​లతో విచారణ కమిటీని నియమించారు.

nandyala-ci-somasekhar-reddy-has-been-suspended-
అబ్దుల్ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సీఐ సస్పెండ్..
author img

By

Published : Nov 8, 2020, 2:28 PM IST

ఏపీలో.. అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఉదంతంపై ఏపీఎస్పీ బెటాలియన్స్‌ ఐజీ శంకబ్రత బాగ్చీ, గుంటూరు అదనపు ఎస్పీ అరీఫ్‌లతో విచారణ కమిటీ వేస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఉత్తర్వులిచ్చారు. కర్నూల్ జిల్లా ఉన్నతాధికారులు ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజుతోనూ విచారణ జరిపిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖర్‌రెడ్డి విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌లో ఉండేలా కర్నూలు రేంజ్​ డీఐజీ వెంకట్రామిరెడ్డి ఉత్తర్వులిచ్చారు.

సెల్ఫీ వీడియో వైరల్..

'నేను చేయని దొంగతనం కేసులో నాపై ఒత్తిడి పెంచుతున్నారు. అది భరించలేకే ప్రాణాలు తీసుకుంటున్నాం. మా చావుతోనైనా మీరు ప్రశాంతంగా ఉండండి’ అంటూ ఆత్మహత్యకు ముందు ఓ కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబ సభ్యులు నలుగురు మంగళవారం పాణ్యం మండలంలో రైలు పట్టాల కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి శుక్రవారం రాత్రి వారి బంధువుల్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు వారు ఆ వీడియోను ఆయనకు చూపించారు. వీడియో క్లిప్పింగ్‌లో.. 'ఆటోలో జరిగిన రూ.70 వేల దొంగతనం, నగల దుకాణంలో బంగారం చోరీతో నాకెలాంటి సంబంధం లేదు. అయినా నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక మాకు చావే దిక్కుంటూ' వాపోయారు. మృతుల కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఒకటో పట్టణ సీఐ సోమశేఖరరెడ్డి, సీసీఐ పోలీసులు, బంగారం దుకాణం యజమానిపై దిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు నంద్యాలకు చెందిన న్యాయవాది బాలహాజీ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.