ఆంధ్రపదేశ్‌లోని కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్‌ను రద్దు చేస్తూ నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టు ఆదేశాలిచ్చింది. డిసెంబరు 2 సాయంత్రంలోపు కోర్టులో హాజరు కావాలని వారిని ఆదేశించింది. పోలీసుల వేధింపుల కారణంగా ఆటో డ్రైవరు సలాం కుటుంబం రైలు కిందపడి ఈ నెల 3న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లను ఈనెల 8న అరెస్టు చేశారు. 9న వారికి వారికి బెయిల్ మంజూరైంది. వీరి బెయిల్ రద్దు చేయాలని మూడో అదనపు జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణ జరిపి...వారి బెయిల్‌ను రద్దు చేసింది.