సంగారెడ్డిలోని మహేశ్వర వైద్య కళాశాల.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి వెయ్యి పీపీఈ కిట్లు, వెయ్యి ఎన్-95 మాస్క్‌లను అందజేసింది. ఆసుపత్రి డైరెక్టర్, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ వాటిని స్వీకరించారు. మహేశ్వర వైద్య కళాశాల వైద్య సేవలే కాకుండా సామాజికంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుండటం అభినందనీయమని బాలకృష్ణ ప్రశంసించారు.
కరోనా మహమ్మారిపై పోరులో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బాలయ్య కోరారు. ఈ పోరులో ప్రభుత్వాలు కూడా బాధ్యతగా పని చేయాలన్నారు. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆకాంక్షించారు. ప్లాస్మా దానం చేసి వైరస్ సోకిన వారి ప్రాణాలను కాపాడాలని బాలయ్య విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'భద్రాచలం ఆసుపత్రిలో 50 శాతం కంటే తక్కువ వైద్యసిబ్బంది'