Balakrishna Ramadan wishes : ప్రముఖ సినీ నటుడు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షను కొనసాగించి.. నేడు రంజాన్ పండుగను జరుపుకొంటున్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు అంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ పండుగ పర్వదినం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
"ముస్లిం సోదర, సోదరీమణులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మత గురువు మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ.. 30 రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలామ్. ఒకవైపు అధ్యాత్మికత, మరోవైపు సర్వమత సమానత్వం, సేవాభావం చాటిచెప్పేదే రంజాన్. ఈ రంజాన్ పర్వదినం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను."
- నందమూరి బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే
ఇవీ చదవండి :