మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, వెంకట చైతన్యల వివాహానికి పెద్దలు ముహూర్తాన్ని ఖరారు చేశారు. డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించినట్లు వరుడి తండ్రి, విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకరరావు తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శించుకొని.. వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం వివాహ వేదికతో పాటు సమయాన్ని ప్రకటించారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్ వేదికగా పెళ్లి వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రభాకరరావు తెలిపారు.